Korean Glass Skin Secrets: అందమైన చర్మం కోసం.. కొరియన్ బ్యూటీ సీక్రెట్స్ ఇవే

ఈ మధ్య కాలం కొరియన్ గ్లాసీ స్కిన్ టోన్ బాగా ట్రెండ్ అవుతోంది. క్లియర్ అండ్ గ్లాసీ స్కిన్ కోసం కొరియన్స్ బ్యూటీ సీక్రెట్స్ ఇవే. ఫేషియల్ వ్యాయామాలు, గ్రీన్ టీ, చార్కోల్ ఫేస్ మాస్క్, ఓవర్ నైట్ ఫేస్ మాస్క్, స్టీమ్.

New Update
Korean Glass Skin Secrets: అందమైన చర్మం కోసం.. కొరియన్ బ్యూటీ సీక్రెట్స్ ఇవే

Korean Glass Skin Secrets: ప్రస్తుతం అమ్మాయిలు బాగా ఇష్టపడుతున్న స్కిన్ టోన్.. కోరియన్స్ గ్లాసీ స్కిన్ టోన్. ఈ మధ్య కాలం చాలా మంది ఈ గ్లాసీ స్కిన్ ఎఫెక్ట్ కోసం టోన్ కోసం రకరకాల బ్యూటీ ప్రాడక్ట్స్ కూడా వాడుతున్నారు. అయితే అందమైన గ్లాసీ స్కిన్ టోన్ కోసం కొరియన్స్ పాటించే బ్యూటీ సీక్రెట్స్ ఇవే. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..

ఫేషియల్ వ్యాయామాలు

మౌత్ స్ట్రెచెస్ చేయడం ద్వారా .. వీ షేప్ జా లైన్ ఏర్పడుతుంది. అంతే కాదు ఈ వ్యాయామాలు చర్మాన్ని టైట్ గా ఉంచి.. యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

గ్రీన్ టీ

కొరియన్స్ హెర్బల్ టీ తాగడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యమైన, అందమైన చర్మం కోసం జిన్సెంగ్, బార్లీ, గ్రీన్ టీ తీసుకుంటారు. వీటిలోని యాంటీ ఆక్షిడెంట్స్ చర్మం పై మొటిమలు రాకుండా పోరాడతాయి. దీంతో చర్మం ఎల్లప్పుడూ నిగారింపుగా, క్లియర్ గా కనిపిస్తుంది.

Also Read: Grey Hair Tips: జుట్టు నల్లగా మారాలంటే నల్ల జీలకర్ర ఫ్యాక్స్ ట్రై చేయండి

చార్కోల్ ఫేస్ మాస్క్

కొరియన్స్ చార్కోల్ ఫేస్ మాస్క్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. వారంలో రెండు లేదా మూడు సార్లు దీన్ని అప్లై చేస్తారు. చార్కోల్ మాస్క్ చర్మ పై డెడ్ స్కిన్ సెల్స్ తో పాటు బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ ను కూడా తొలగిస్తుంది. ఇది క్లియర్ స్కిన్ కు సహాయపడుతుంది.

publive-image

స్టీమ్

గ్లాసీ స్కిన్ టోన్ స్టీమ్ తీసుకోవడం అద్భుతమైన చిట్కా. స్టీమ్ తీసుకోవడం ద్వారా చర్మంలోని పోర్స్ ఓపెన్ అవుతాయి. దీని వల్ల చర్మ రంద్రాల్లోని దుమ్ము, దూళి బయటకు వెళ్ళిపోయి.. స్కిన్ క్లియర్ గా తయారవుతుంది.

ఫింగర్ టిప్స్ తో ట్యాప్ చేయడం

ఏదైనా సీరం లేదా టోనర్ ఉపయోగించినప్పుడు.. దానిని ఫింగర్స్ తో ట్యాప్ చేస్తే చర్మంలోకి బాగా ఇంకుకుపోతుంది. ఇలా చేయడం ద్వారా చర్మం పై వాటి ప్రభావం మంచిగా ఉండడంతో పాటు చర్మాన్ని నిగారింపుగా చేస్తుంది. కొరియన్ అమ్మాయిల సీక్రెట్ కూడా ఇదేనట.

ఓవర్ నైట్ ఫేస్ మాస్క్

కొరియన్ అమ్మాయిలు ఓవర్ నైట్ ఫేస్ మాస్క్ ధరిస్తారు. ఇది రాత్రి సమయాల్లో డ్యామేజ్డ్ చర్మాన్ని రిపేర్ చేసి.. చర్మాన్ని పునరుజ్జీవనం చేస్తుంది. అలాగే చర్మ సౌదర్యానికి అవసరమయ్యే కొల్లాజిన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. దీంతో స్కిన్ ఫ్రెష్ గా క్లియర్ గా ఉంటుంది.

Also Read: Makeup Essentials: అమ్మాయిలు బయటకు వెళ్ళేటప్పుడు.. క్యారీ చేయాల్సిన ఐదు మేకప్ ఎసెన్షియల్స్

Advertisment
తాజా కథనాలు