Nagababu: టీటీడీ చైర్మన్ పదవి.. క్లారిటీ ఇచ్చిన నాగబాబు ..! టీటీడీ చైర్మన్ పదవిపై నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పదవి ఆశించడం లేదన్నారు. టీటీడీ చైర్మన్ ఇస్తున్నారన్న ప్రచారాన్ని ఖండించారు. జనసేన పార్టీకి అండగా ఉంటానని..తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపారు. పార్టీ అధికారిక ఖాతా నుంచి ఇచ్చే సమాచారాన్నే నమ్మాలని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 06 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Konidela Nagababu : జనసేన నేత నాగబాబు టీటీడీ బోర్డ్ ఛైర్మన్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించాయి. చంద్రబాబు ప్రభుత్వంలో తన అన్నకు జనసేనాని కీలక పదవి కోరినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో నాగబాబు పార్లమెంట్ సీటు త్యాగం చేసిన సంగతి తెలిసిందే. Also Read: RTV చేతిలో లోకేష్ రెడ్ బుక్ .. సిరీస్-1లో ఐదుగురి పేర్లు.. ఎవరెవరున్నారంటే? కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాల్లో కీలక పదవులపై చంద్రబాబుతో పవన్ చర్చలు జరిపారు. పదేళ్లుగా జనసేనను నమ్ముకున్న వారందరికీ జనసేనాని న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రభుత్వంలో అన్న నాగబాబుకు కీలక పదవి ఇప్పించనున్నారు. అటు స్థానిక సంస్థల్లోనూ పార్టీ శ్రేణులకు ప్రాధాన్యం కల్పించనున్నారు జనసేన అధినేత. Also Read: జగన్ జైలుకే.. ఆయనకు రంకుమొగుడు ఇతడే.. బుద్దా వెంకన్న సెన్సేషనల్ కామెంట్స్..! అయితే, టీటీడీ చైర్మన్ పదవిపై నాగబాబు క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పదవి ఆశించడం లేదన్నారు. టీటీడీ చైర్మన్ ఇస్తున్నారన్న ప్రచారాన్ని ఖండించారు. జనసేన పార్టీకి అండగా ఉంటానని..తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. పార్టీ అధికారిక ఖాతా నుంచి ఇచ్చే సమాచారాన్నే నమ్మాలని నాగబాబు ట్వీట్ లో పేర్కొన్నారు. Do not believe any fake news. Trust only information from official party handles or my verified social media accounts. Please do not trust or spread fake news. — Naga Babu Konidela (@NagaBabuOffl) June 6, 2024 #konidela-nagababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి