/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Nagababu-jpg.webp)
Konidela Naga Babu : ఏపీలో కౌంటింగ్ కు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. దీంతో అల్లర్లు జరిగే అవకాశం ఉందని పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు 144సెక్షన్ అమలు చేస్తున్నారు. మరోవైపు, గెలుపు తమదంటే తమదంటూ అటు వైసీపీ నేతలు, ఇటు కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పిఠాపురంలో 144 సెక్షన్.. అనవసరంగా బైకులపై తిరిగితే జరిగేది ఇదే..!
తాజాగా టాలీవుడ్ యాక్టర్, జనసేన నేత నాగబాబు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. కూటమి నేతలు, జనసైనికులకు ఓ రిక్వెస్ట్ చేశారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉందని.. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దామని కోరారు. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
రాబోయే కూటమి గెలుపుని ఓర్వలేక,ఓటమి భారాన్ని తట్టుకోలేక ఓట్ల లెక్కింపు రోజున వైసిపి చేసే ఏ దాడినైన సంయవనంతో జయించండి అధికారులకి సహకరించండి...#jaijanasena #JaiHind @JanaSenaParty@JSPShatagniTeam pic.twitter.com/D9Y9bxNxwk
— Naga Babu Konidela (@NagaBabuOffl) May 30, 2024
కూటమి నేతలు, జనసైనికులందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ కవ్వింపు చర్యలకు ఏ మాత్రం ప్రతిస్పందించొద్దన్నారు. కచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.