Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ పై కోమటిరెడ్డి సంచలన రియాక్షన్.. జెండాలు మోసిన అందరికీ..

ఈ రోజు విడుదలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి లిస్ట్ పై ఆ పార్టీ కీలక నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మొదటి లిస్ట్ లో బీసీలకు 12 సీట్లు దక్కాయన్నారు. నెక్ట్స్ లిస్ట్ లో మరిన్ని సీట్లు లభిస్తాయన్నారు. బీఆర్ఎస్ కన్నా తామే బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామన్నారు. టికెట్ రానివాళ్లంతా వచ్చిన వారితో పాటు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి జెండాలు మోసిన అందరికీ పదవులు దక్కుతాయన్నారు.

Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ పై కోమటిరెడ్డి సంచలన రియాక్షన్.. జెండాలు మోసిన అందరికీ..
New Update

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 55 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కీలక నేతల కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రకటించిన మొత్తం 55 సీట్లలో బీసీలకు 12, జనరల్ 26, మైనారిటీ లకు 3 సీట్లు ఉన్నాయన్నారు. బీసీలకు తర్వాత జాబితాలో సైతం మంచి సంఖ్యలో సీట్లు లభిస్తాయన్నారు. కేసీఆర్ కంటే 4 సీట్లు ఎక్కువే బీసీలకు ఇస్తున్నామన్నారు. టికెట్లు రాని వారు నిరాశ చెందవద్దని ఈ సందర్భంగా కోమటిరెడ్డి కోరారు. తమ నాయకులందరి ఉమ్మడి లక్ష్యం తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమని స్పష్టం చేశారు కోమటిరెడ్డి. అందుకోసం అందరూ కలిసి పని చేయాలని పిలపునిచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా సరే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్నారు. ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ స్కూళ్లు మూతపడ్డాయన్నారు. డీఎస్సీ నియామకాలు లేక స్కూళ్లకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ సరిగా అమలు చేయడం లేదని మండిపడ్డారు.
ఇది కూడ చదవండి: T-Congress First List: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ లో 11 మంది బీసీలు.. లిస్ట్ ఇదే!

ప్రవళిక అనే అమ్మాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం ప్రిపేర్ అయి, పరీక్షలు రద్దు కావడం వల్ల ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా టిక్కెట్లు దక్కనివారికి ఇతర పదవులు వస్తాయన్నారు. వారిని అధిష్టానం పెద్దల వరకు తీసుకొచ్చి కలిపిస్తామన్నారు. ఎమ్మెల్సీ, ఎంపీ, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇలా చాలా పదవులు ఉన్నాయన్నారు. టికెట్ రానివాళ్లంతా వచ్చిన వారితో పాటు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. వచ్చే లిస్ట్ లో కూడా సామాజిక సమీకరణాలు చూసి టిక్కెట్లు ఇస్తామన్నారు. కష్టపడి జెండాలు మోసిన అందరికీ పదవులు దక్కుతాయన్నారు.
ఇది కూడా చదవండి: BRS Manifesto: అందరికీ రూ.5 లక్షల బీమా.. రూ.400 కే గ్యాస్ సిలిండర్: బీఆర్ఎస్ ఫుల్ మేనిఫెస్టో ఇదే!

లెఫ్ట్ పార్టీలతో పొత్తు కారణంగా తమకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ గెలిచే మిర్యాలగూడ సీటును వారు అడుగుతున్నారన్నారు. వారు గెలిచే అవకాశం ఉన్న మునుగోడును తీసుకోండి అంటే కొత్తగూడెం కావాలని అడుతున్నారన్నారు. జాతీయస్థాయిలో ప్రయోజనాలు చూసుకుని అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని తాము గౌరవించాల్సి ఉంటుందన్నారు. పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారడం బాధాకరమని అన్నారు.

కానీ ఆయన టికెట్స్ అమ్ముకుంటున్నారని నిందలు వేయడం సరికాదన్నారు. ఆయనకు టికెట్ రాకపోతే రేపు రాజ్యసభ వచ్చేదేమోనని అన్నారు. టికెట్స్ ఇచ్చేది హై కమాండ్ మాత్రమేనని స్పష్టం చేశారు. పీపీసీసీ చీఫ్ ను తిడితే హై కమాండ్ ను తిట్టినట్లేనన్నారు. పీసీసీ చీఫ్ కోఆర్డినేటర్ మాత్రమేనన్నారు. ఆయనను అంటే ఏమొస్తుంది? అని ప్రశ్నించారు. షర్మిల చేరిక విషయంలో నో కామెంట్ అని వాఖ్యానించారు. ఆమె వచ్చి ఉంటే బాగుండేదన్నారు.

#komati-reddy-venkat-reddy #telangana-congress
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe