Komaram Bheem: ప్రేమించలేదనే కక్ష్యతో యువతిని ఏం చేశాడంటే..?

కొమురంభీం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదనే కక్ష్యతో యువతిని హత్య చేశాడు ఓ సైకో. బలవంతంగా పురుగుల మందు తాగించి పారిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.

Komaram Bheem: ప్రేమించలేదనే కక్ష్యతో యువతిని ఏం చేశాడంటే..?
New Update

Komaram Bheem: తనను ప్రేమించమని వెంటపడ్డాడు. అందుకు యువతి ససేమిరా అంది. 6 నెలలుగా వేధించాడు. అయిన, ఆమె అతని ప్రేమను అంగీకరించలేదు. ప్రేమించకపోతే  తన ఇంట్లో వాళ్లను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అయినప్పట్టికీ యువతి ఒప్పుకోలేదు. అంతే, విసుగు చెందిన సైకో ప్రేమికుడు  బలవంతంగా పురుగుల మందు తాగించి పారిపోయాడు. తనను ప్రేమించలేదనే కక్ష్యతో యువతిని హత్య చేశాడు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇంకా అసలు విషయం ఏమిటంటే ఆ యువకుడికి ఇంతకు ముందే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

కొమురంభీం జిల్లా వెంకట్రావ్‌పేటకు చెందిన బుడే దీప (19) ఇంటర్ తో చదువు ఆపేసింది. గ్రామంలో కూలీ పనులకు వెళుతూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేది. అయితే, అదే గ్రామానికి చెందిన దంద్రే కమలాకర్‌ ప్రేమించానంటూ దీప వెంటపడేవాడు. ఆరు నెలలుగా వేధింపులకు గురిచేశాడు. అయితే, కమలాకర్ కు ఇంతకు ముందే పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా దీపను ప్రేమ పేరుతో వెంటపడి వేధించేవాడు.

దీప తననే ప్రేమించాలని లేదంటే ఇంట్లో వాళ్లను చంపేస్తానంటూ  బెదిరింపులకు దిగాడు. అయినా దీప ఒప్పుకోకపోవడంతో కక్ష్య పెంచుకున్నాడు. ఈ నెల 17న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో దీప ఒంటరిగా ఉండడం గమనించి ఇంట్లోకి చొరబడ్డాడు. తనను కాదని వేరే వాళ్లతో మాట్లాడవద్దంటూ దీపపై చేయిచేసుకున్నాడు. దీప తనకు ఎదురుతీరగడంతో అతను ఆగ్రహానికి గురైయ్యాడు. వెంటనే ఇంట్లో ఉన్న పురుగులమందును బలవంతంగా దీప నోట్లో పోసి మింగించాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

స్థానికులు వెంటనే దీపను సిర్పూర్ (టి) ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కాగజ్ నగర్ కు, ఆపై మంచిర్యాలకు తరలించారు. దీప ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో కరీంనగర్ తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం దీప కన్నుమూసింది. తొలుత దీప ఆత్మహత్యకు పాల్పడిందని భావించగా.. కమలాకర్ బలవంతంగా పురుగుల మందు తాగిస్తుండగా చూసిన పదేళ్ల పాప ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు చావకు కారణామైనవాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు ఆ చిన్నారిని విచారించి మరిన్ని వివరాలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసి, నిందితుడు కమలాకర్ ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

Also Read: ఈ ఆకులు డెంగ్యూని దూరం చేస్తాయట..!!

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి