Prasanth : రామ్ చరణ్ వల్లే ఆ సినిమాలో నటించా.. తమిళ్ హీరో ఇంట్రస్టింగ్ కామెంట్స్!

తమిళ హీరో ప్రశాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ‘వినయ విధేయ రామ’ సినిమాలో యాక్ట్‌ చేయడంపై స్పందించారు. " రామ్‌చరణ్‌ అంటే అభిమానం ఉంది. ఎంతోకాలం నుంచి మా మధ్య అనుబంధం ఉంది. స్నేహంతోనే ఆ సినిమాలో నటించా" అని తెలిపారు.

New Update
Prasanth : రామ్ చరణ్ వల్లే ఆ సినిమాలో నటించా.. తమిళ్ హీరో ఇంట్రస్టింగ్ కామెంట్స్!

Kollywood Actor Prasanth : జీన్స్, జోడి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో ప్రశాంత్.. తాజాగా 'అంధగన్' అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో యాక్ట్‌ చేయడంపై స్పందించారు.

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'వినయ విధేయ రామ' అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రశాంత్.. రామ్ చరణ్ కు అన్నగా నటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. అయితే తాజా ఇంటర్వ్యూలో ప్రశాంత్ ఈ సినిమాలో యాక్ట్ చేయడంపై మాట్లాడుతూ.." స్నేహం కారణంగానే ‘వినయ విధేయ రామ’ చేశా.

Also Read : హీరోయిన్ కు లేని బాధ వాళ్ళకెందుకో.. ‘మిస్టర్ బచ్చన్’ ట్రోల్స్‌పై హరీష్‌ శంకర్‌ స్ట్రాంగ్ కౌంటర్

బోయపాటి శ్రీను తెలుగులో అగ్ర దర్శకుడు. ఆ పాత్రకు నేనే న్యాయం చేయగలనని ఆయన భావించారు. ఆయనంటే నాకెంతో గౌరవం ఉంది. రామ్‌చరణ్‌ అంటే అభిమానం ఉంది. ఎంతోకాలం నుంచి మా మధ్య అనుబంధం ఉంది. ప్రేమాభిమానం, స్నేహంతోనే సినిమాలో చేశా" అని తెలిపారు. కాగా ప్రశాంత్ ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు ఇతర అగ్ర హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ప్రెజెంట్ తలపతి విజయ్ 'ది గోట్' లో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

Advertisment
తాజా కథనాలు