Star Movie: తమిళ్ సూపర్ హిట్.. 'స్టార్' ఇప్పుడు తెలుగులో కూడా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

తమిళ నటుడు న‌టుడు కవిన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'స్టార్'. మే 10న తమిళంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా 'స్టార్' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా త‌మిళ, తెలుగు భాషల్లో స్ట్రీమవుతోంది.

New Update
Star Movie: తమిళ్ సూపర్ హిట్.. 'స్టార్' ఇప్పుడు తెలుగులో కూడా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Star Movie: తమిళ నటుడు కవిన్ ‘దాదా’, 'లిఫ్ట్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే నటుడు కవిన్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ 'స్టార్'. 'ప్యార్ ప్రేమ కాదల్' ఫేమ్ ఎలాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మే 10న తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రైస్ ఈస్ట్ ఎంట‌ర్‌టైన‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్

అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందు వచ్చేసింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వేదికగా తమిళ్ తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో లాల్, ఆదితి పోహంకర్, ప్రీతి ముఖుందన్, గీతా కైలాసం ప్రధాన పాత్రలో నటించారు.

Also Read: OTT Trending: ఓటీటీలో టాప్ ట్రెండింగ్ సీరీస్, సినిమాలు.. షాకయ్యే రేటింగ్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు