Kolkata case: కోల్‌కతా జూనియర్ డాక్టర్ అభయ అత్యాచారం కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు సంజయ్‌రాయ్‌తో పోలీసులకు సన్నిహిత సంబంధాలున్నట్లు సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చింది. పోలీస్ కమిషనర్ పేరుతో రిజిస్టర్ అయిన బైక్‌పై కొంతకాలంగా సంయజ్ తిరుగుతుండగా.. ఘటన జరిగిన రోజు అదే బైక్ ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు సంజయ్ అదే బైక్‌పై రెడ్‌లైట్ ఏరియాల్లోనూ తిరిగినట్లు ఆధారాలు సేకరించారు. ఇక 2014 మేలో బెల్టాలా RTO కమిషనర్ ఆఫ్ పోలీస్ కోల్‌కతా పేరుతో బైక్ రిజిస్టర్ అయినట్లు తెలిపారు.
కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం..
మరోవైపు కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. జూనియర్ డాక్టర్ అభయ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు నిసరస ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగానే నబన్న మార్చ్ పేరిట విద్యార్థి సంఘాలు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. అయితే పెద్ద ఎత్తన తరలివచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. దీంతో తమను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసు బలగాలు వెంటనే విద్యార్థులను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. అయినా స్టూడెంట్స్ వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వాటర్ కెనాన్స్, బాష్పవాయువు ప్రయోగించారు.
ఇది కూడా చదవండి: TG DSC: తెలంగాణలో మరో డీఎస్సీ.. టెట్ పరీక్షకు ప్రణాళిక ఖరారు!
ఈ క్రమంలోనే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నిరసనకారులను అడ్డుకునేందుకు సచివాలయాన్ని అష్టదిగ్బంధం చేశారు. 6 వేల మంది పోలీసులతో మూడెంచల భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికెడ్లను అడ్డుగా పెట్టారు. అయినా నిరసనకారులు దూసుకురావడంతో వెంటనే స్పందించిన గవర్నర్ సీవీ ఆనంద్ బోస్.. విద్యార్థుల శాంతియుత ర్యాలీని అణిచివేయవద్దని పోలీసులను కోరారు. శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం చేయవద్దని.. మమతా బెనర్జీ ప్రభుత్వానికి సూచించారు.