KKR Vs SRH : ఘోరంగా విఫలమైన 'హైదరాబాద్' బ్యాటర్లు.. తక్కువ స్కోరుకే ఆల్ అవుట్, కోల్ కతా టార్గెట్ ఎంతంటే..?

కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్ -1 లో సన్ రైజర్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ పూర్వ వైభవాన్ని చూపిస్తుందనుకుంటే 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆల్ ఆవుట్ అయింది.

KKR Vs SRH : ఘోరంగా విఫలమైన 'హైదరాబాద్' బ్యాటర్లు.. తక్కువ స్కోరుకే ఆల్ అవుట్, కోల్ కతా టార్గెట్ ఎంతంటే..?
New Update

Kolkata Knight Riders Vs Sunrisers Hyderabad : అహ్మదాబాద్ (Ahmadabad) లో కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) తో జరుగుతున్న క్వాలిఫయర్ -1 లో సన్ రైజర్స్ (SRH) బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ పూర్వ వైభవాన్ని చూపిస్తుందనుకుంటే 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆల్ ఆవుట్ అయింది.

వన్‌ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (55; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్ గా నిలవగా.. హెడ్, అభిషేక్ ఇద్దరు ఓపెనర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. హెన్రిచ్‌ క్లాసెన్ (32; 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు.126 పరుగులకు 9 వికెట్లు కోల్పోయిన దశలో పాట్ కమిన్స్ (30; 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో హైదరాబాద్‌ పోరాడే స్కోరు సాధించగలిగింది.

Also Read : టీ 20 వరల్డ్ కప్.. ఆఫ్గనిస్థాన్ కోచ్ గా విండీస్ మాజీ క్రికెటర్!

కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, వరుణ్ చక్రవర్తి 2, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, రస్సెల్ తలో వికెట్ పడగొట్టారు. మరి ఈ తక్కువ స్కోరుతో కోల్ కతా బ్యాటర్స్ ని సన్ రైజర్స్ టీమ్ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. మన హైదరాబాద్ బౌలర్లు ఏదైనా మ్యాజిక్ చేస్తే తప్ప గెలిచే అవకాశాలు చాలా తక్కువ.

#kkr-vs-srh #ipl-2024-qualifier-1
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe