KKR Vs SRH : ఘోరంగా విఫలమైన 'హైదరాబాద్' బ్యాటర్లు.. తక్కువ స్కోరుకే ఆల్ అవుట్, కోల్ కతా టార్గెట్ ఎంతంటే..? కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్ -1 లో సన్ రైజర్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ పూర్వ వైభవాన్ని చూపిస్తుందనుకుంటే 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆల్ ఆవుట్ అయింది. By Anil Kumar 21 May 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Kolkata Knight Riders Vs Sunrisers Hyderabad : అహ్మదాబాద్ (Ahmadabad) లో కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) తో జరుగుతున్న క్వాలిఫయర్ -1 లో సన్ రైజర్స్ (SRH) బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ పూర్వ వైభవాన్ని చూపిస్తుందనుకుంటే 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆల్ ఆవుట్ అయింది. వన్ డౌన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి (55; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ గా నిలవగా.. హెడ్, అభిషేక్ ఇద్దరు ఓపెనర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. హెన్రిచ్ క్లాసెన్ (32; 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు.126 పరుగులకు 9 వికెట్లు కోల్పోయిన దశలో పాట్ కమిన్స్ (30; 24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో హైదరాబాద్ పోరాడే స్కోరు సాధించగలిగింది. Also Read : టీ 20 వరల్డ్ కప్.. ఆఫ్గనిస్థాన్ కోచ్ గా విండీస్ మాజీ క్రికెటర్! కోల్‌కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, వరుణ్ చక్రవర్తి 2, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, రస్సెల్ తలో వికెట్ పడగొట్టారు. మరి ఈ తక్కువ స్కోరుతో కోల్ కతా బ్యాటర్స్ ని సన్ రైజర్స్ టీమ్ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. మన హైదరాబాద్ బౌలర్లు ఏదైనా మ్యాజిక్ చేస్తే తప్ప గెలిచే అవకాశాలు చాలా తక్కువ. #kkr-vs-srh #ipl-2024-qualifier-1 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి