Kolkata Rape Case: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార కేసు.. అసలేం జరిగిందంటే?

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూటకో షాకింగ్ విషయం బయటకు వస్తోంది. దీంతో నిందితుడిని ఉరి తీయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.

New Update
Kolkata Rape Case: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార కేసు.. అసలేం జరిగిందంటే?

Kolkata Rape Case: ప్రతి 16 నిమిషాలకు భారత్‌లో ఓ అత్యాచార ఘటన జరుగుతోంది.. ఏడాదికి నాలుగున్నర లక్షలకు పైగా రేప్‌ కేసులు దేశంలో రికార్డవుతున్నాయి.. 2012 నిర్భయ అత్యాచార ఘటన తర్వాత కఠిన చట్టలు అమలవుతున్నా అత్యాచార కేసుల్లో ఏ మాత్రం తగ్గుదల కనిపించడంలేదు. ప్రతీఏడాది కేసుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. అటు కోల్‌కతా RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బాధితురాలికి న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు దిగిన నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి.

సామూహిక అత్యాచారం

ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అటు ఈ కేసులో రోజులు గడిచే కొద్దీ విస్తూపోయే విషయాలు బయటపడుతున్నాయి. మృతురాలిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె శరీరంలో అధిక మొత్తంలో వీర్యం ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. మృతిరాలి రహస్య అవయవాలతో పాటు కళ్లు, నోటి నుంచి బ్లీడింగ్ అయ్యిందని రిపోర్టులు చెబుతున్నాయి. ముఖం, గోళ్లపై గాయాలతో పాటు ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, కడుపు, చేతి వెళ్లపై గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదిక చెబుతోంది.

పాశవిక దాడి 

అటు మృతురాలిపై పాశవికంగా దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడినట్లు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆమె శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు గుర్తించారు. కూతురు మృతిపై ఆమె తల్లిదండ్రులు.. కోర్టులో వేసిన పిటిషన్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తమ కూతురిపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారం చేసి ఉంటారని ఆరోపించారు.

దేశవ్యాప్తంగా నిరసనలు

మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌-కోల్‌కతాలో ఆగస్టు 11న ప్రారంభమైన నిరసనలు ఆ తర్వాతి రోజుకు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. రాజధాని న్యూఢిల్లీ, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్, అటు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ప్రయాగ్‌రాజ్, బీహార్ రాజధాని పాట్నాతో పాటు ఇటు గోవాలో నిరసనలు వెల్లువెత్తాయి. ఇక తరచుగా ఆసుపత్రికి వచ్చే సివిక్‌ వాలంటీర్ అయిన సంజయ్ రాయ్‌ను అనుమానితుడి కింద పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్‌ అత్యాచారం, హత్య వెనుక సంజయ్‌ హస్తం ఉందని పోలీసులు ఇప్పటికే సాక్ష్యాలు కనుగొన్నారు.

వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్ 

సాధారణంగా సివిక్‌ వాలంటీర్లు కాంట్రాక్ట్‌ ప్రాతిపాదికన పని చేస్తారు. ట్రాఫిక్‌ నిర్వహణ, విపత్తు స్పందన లాంటి విభాగాల్లో పని చేస్తారు. నెలకు 12 వేల రూపాయల జీతానికి వీరిని నియమిస్తారు. 2019లో సంజయ్‌రాయ్‌ విపత్తు స్పందన విభాగంలో వాలంటీర్‌గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత సంజయ్‌ను పోలీస్‌ సంక్షేమ విభాగానికి మార్చారు. అక్కడ నుంచి ఆర్జీ కర్‌ వైద్య కళాశాల ఆస్పత్రిలోని పోలీస్‌ ఔట్‌పోస్టులో డ్యూటీ వేశారు. ఇక్కడ అనేక దందాలకు పాల్పడిన సంజయ్‌ డ్యూటీ చేస్తూనే ట్రైనీ డాక్టర్‌పై కన్నేసి హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

పోర్న్ వీడియోలు..

ఇక నిందితుడు సంజయ్‌కు అదేపనిగా పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఉందని పోలీసులు చెబుతున్నారు. ట్రైనీ డాక్టర్‌ను హత్య చేయడానికి ముందు అతను పోర్న్ వీడియో చూశాడని తెలుస్తోంది. అటు మద్యం సేవించి ఉన్నాడు. తాగిన మత్తులో ఘోరానికి పాల్పడ్డాడు. తమ దర్యాప్తులో ఈ విషయాలను సంజయ్‌ అంగీకరించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. కావాలంటే ఉరి తీసుకోండని సంజయ్‌ పోలీసులకు చెప్పాడట..! చేసిన నేరానికి అతను ఏ మాత్రం పశ్చాత్తాప పడలేదని పోలీసులు అంటున్నారు.

Also Read: Upasana Konidela : ఇదేనా స్వాతంత్య్రం..? కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యపై ఉపాసన ఆవేదన! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు