Kolkata Case : సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆందోళన విరమించిన ఎయిమ్స్ డాక్టర్లు!

కోల్‌కతా జూనియర్ డాక్టర్ కేసులో 11 రోజులుగా చేస్తున్న ఆందోళనలు విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన హామీతోపాటు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

New Update
Kolkata Case : సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆందోళన విరమించిన ఎయిమ్స్ డాక్టర్లు!

Supreme Court : కోల్‌కతా జూనియర్ డాక్టర్ (Kolkata Trainee Doctor) కేసులో 11 రోజులుగా చేస్తున్న ఆందోళనలు విరమిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన హామీతోపాటు ఆదేశాలు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు అభయకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీ ఎయిమ్స్‌, ఆర్‌ఎంఎల్‌తోపాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసుపై స్పందించిన సుప్రీం కోర్టు.. నిరసన తెలుపుతున్న వైద్యులను తిరిగి విధుల్లో చేరాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది. తిరిగి విధుల్లో చేరిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని వారికి న్యాయస్థానం హామీ ఇచ్చింది.

'భారత ప్రధాన న్యాయమూర్తి సానుకూల ఆదేశాలను అనుసరించి సమ్మెను విరమించుకోవాలని FAIMA నిర్ణయించుకుంది. వైద్యులకు రక్షణ, ఆసుపత్రులలో భద్రతను పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టాలనే మా డిమాండ్ ను అంగీకరించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇకపై కూడా మేము ఐక్యంగా, న్యాయపరంగా పోరాడుతూనే ఉంటాం' అని ఎయిమ్స్ పోస్ట్ పెట్టింది.

Also Read : కంపెనీల్లో ప్రాణాలకు విలువ లేని పరిస్థితి.. పవన్ కళ్యాణ్ ఆవేదన!

Advertisment
తాజా కథనాలు