Kolikapudi: కొడాలి నాని నమ్మిన దోస్త్ ను మోసం చేసిన దొంగ: కొలికపూడి జూనియర్ ఎన్టీఆర్ అభిమాని దగ్గర కొడాలి నాని కోటి రూపాయిలు తీసుకున్నారని ఆరోపించారు టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్. అది నిజమా? కాదా? అని తేల్చడానికి నాని చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. నమ్మిన దోస్త్ ను మోసం చేసిన దొంగ కొడాలి నాని అని కొలికపూడి మండిపడ్డారు. By Jyoshna Sappogula 21 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Kolikapudi Srinivasa Rao: టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్ మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారని..అయితే, ప్రజాసమస్యలపై ఏనాడు కొడాలి నాని మాట్లాడిందే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని అంటే మోసమని.. నాని అంటే నమ్మించి నిండా ముంచడం అని విమర్శలు గుప్పించారు. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ మద్దతుతో హరికృష్ణ బిక్షతో రాజకీయంగా ఎదిగారని వ్యాఖ్యానించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా కొడాలి నాని బాధితుడే అని చెప్పుకొచ్చారు. జూ. ఎన్టీఆర్ అభిమాని దగ్గర కొడాలి నాని రూ. కోటి తీసుకున్నారని.. అది నిజమా? కాదా? తేల్చడానికి నాని చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. Also Read: మాతృభాష అంటే సాంస్కృతిక వారధి.. దానిని కాపాడుకోవడం అందరి విధి.. హైదరాబాద్ శివారులో 12 ఎకరాల ప్రభుత్వ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి వేరే వ్యక్తుల ద్వారా సాక్షాత్తు ఎన్టీఆర్‌కు ఎకరం రూ. 85 లక్షలు చొప్పున అమ్మి మోసం చేశారని ఆరోపించారు. ఆ తరువాత వచ్చిన తెలంగాణ సర్కార్ జరిగిన మోసాన్ని గుర్తించి ఆ భూమిని స్వాధీనం చేసుకుందని తెలిపారు. గుడివాడలో కొడాలి నాని వల్ల మోసపోయిన కాపునేత ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నాని ఉనికికి ప్రమాదం ఏర్పడినపుడు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌ను విమర్శిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో ఒకరిని తిట్టడానికే మాత్రమే కొడాలి నాని ప్రెస్ మీట్స్ పెడతారన్నారు. వ్యక్తిగత విమర్శలు, రాజకీయ విమర్శలు జగన్‌ను సంతృప్తిపరచడానికే కొడాలి నాని మాట్లాడతారన్నారు. మేము చెప్పిన అంశంపై గుడివాడలో చర్చ పెట్టు మేము వస్తాం.. నాని లాంటి కుక్కతో మనకెందుకు అని వొదిలేస్తున్నారు తప్ప.. మరేమీ కారణం కాదని తీవ్ర స‌్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి