Kodi kathi Srinivas: కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌ విడుదల

కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌ విశాఖ కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. అతనికి ఎస్సీ సంఘాల నాయకులు స్వాగతం పలికారు. కోడికత్తి శ్రీనివాస్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్ల జైలు శిక్ష తరువాత శ్రీనివాస్ విడుదల అయ్యాడు.

New Update
Kodi kathi Srinivas: కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌ విడుదల

Kodi kathi Srinivas: గతంలో సీఎం జగన్ పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి తో దాడి చేసి అరెస్ట్ అయిన నిందితుడి శ్రీనివాస్ ఈ రోజు విశాఖ కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదల అయ్యాడు. కోడి కత్తి శ్రీనివాస్‌కు ఎస్సీ సంఘాల నాయకులు ఘానా స్వాగతం పలికారు. నిన్న (గురువారం) కోడికత్తి శ్రీనివాస్‌కు షరతులతో కూడిన బెయిల్‌ ను హైకోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోడి కత్తి కేసులో దాదాపు ఐదేళ్ల తర్వాత శ్రీనివాస్‌కు బెయిల్‌ లభించింది.

ఐదేళ్లుగా జైలులో..

ఐదేళ్లుగా జైలులో మగ్గుతున్న నిందితుడు జనపల్లి శ్రీనివాసరావుకు న్యాయ స్థానం రిలీఫ్ కల్పించడంపై కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హైకోర్టు తీర్పుపై దళిత, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 2018లో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం జగన్‌(CM Jagan) పై అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయం(Visakha Airport) లో కోడి కత్తితో శ్రీనివాసరావు దాడి చేశాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. అయితే దీన్ని న్యాయస్థానం నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు శ్రీనివాసరావు.

బెయిల్‌ మంజూరు...

ఈ క్రమంలో దీనిపై కొద్దిరోజుల క్రితం విచారణ చేపట్టింది ఉన్నత న్యాయస్థానం. బాధితుడు జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం చేస్తున్నారని, దీంతో నిందితుడు జైల్లోనే మగ్గిపోతున్నాడంటూ పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి సుధీర్ఘకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు వివరించారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం ఇటీవలే తీర్పు రిజర్వు చేయగా తాజాగా బెయిల్‌ మంజూరు చేసింది.

Advertisment
తాజా కథనాలు