Kodali Nani: చంద్రబాబు ఛాలెంజ్ కు మాజీ మంత్రి కొడాలి నాని రియాక్షన్..! అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్నా పారిపోయిన చంద్రబాబు.. చేతకాక ట్విట్టర్‌లో ఛాలెంజ్‌లు చేస్తున్నారని కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. నేను సిద్ధం అంటే నాతో చర్చకు చంద్రబాబు వస్తాడా? అని ప్రశ్నించారు. డొంక తిరుగుడు మాటలు మానుకోవాలని హితబోధ చేశారు. By Jyoshna Sappogula 20 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Kodali Nani on Chandrababu Challenge: రాష్ట్ర అభివృద్ధిపై సీఎం జగన్ (CM Jagan) బహిరంగ చర్చకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) చేసిన ఛాలెంజ్ కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఉన్న పారిపోయిన చంద్రబాబు.. చేతకాక ట్విట్టర్ లో చాలెంజ్ లా అని ఎద్దేవ చేశారు. తనలా మాజీలుగా ఉన్నవారికి చంద్రబాబు ఛాలెంజ్ లు చేసుకోవాలని.. ప్రజలు ఎన్నుకున్న జగన్ తో కాదని ఎద్దేవ చేశారు. చర్చకు వస్తాడా? నేను సిద్ధం అంటే నాతో చర్చకు చంద్రబాబు వస్తాడా? అని ప్రశ్నించారు. మూడు పార్టీలతో కలిసి వస్తున్నా.. సీఎం జగన్ ను ఎదుర్కోలేని స్థాయి చంద్రబాబుదని విమర్శలు గుప్పించారు. టీడీపీ పార్టీ (TDP Party) సైజు ఎంతో తెలుసుకోవాలని..ఆ పార్టీకు పార్లమెంట్, రాజ్యసభ, అసెంబ్లీ, శాసనమండలిలో ఎంతమంది ఉన్నారో గుర్తించి ఛాలెంజ్ లు చెయ్యాలని హెచ్చరించారు. Also Read: ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. లోకేష్ కు మంత్రి అమర్నాథ్ సవాల్ ..! ఎక్కడైనా జరిగిందా? సీఎం జగన్ చాలా స్పష్టంగా ఎన్నికలకు వెళుతున్నారని కామెంట్స్ చేశారు కొడాలి నాని (Kodali Nani). మీ కుటుంబాల్లో మంచి జరిగితే తనకు ఓటు వేసి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. 14 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు అమలు చేసిన ఓ పథకం, లేదా రాష్ట్రంలో అభివృద్ధికి చేసిన కార్యక్రమాలను చెప్పాలని ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేని చంద్రబాబు.. బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ చాలెంజ్ లు చేస్తున్నాడని కామెంట్స్ చేశారు. భారతదేశంలో ఇద్దరి పెద్ద నాయకుల మధ్య బహిరంగ చర్చ ఎక్కడైనా జరిగిందా?.. డొంక తిరుగుడు మాటలు మాని దమ్ముంటే మాలాగా ప్రజలకు చేసిన మంచిని చంద్రబాబు చెప్పుకోవాలని ఛాలెంజ్ చేశారు. ఎవరు సీఎంగా ఉండాలో నిర్ణయించేది జగన్, చంద్రబాబు కాదని.. ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. #chandrababu #kodali-nani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి