Kodali Nani: వైసీపీ ఓడిపోతుందన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యాలపై కొడాలి కామెంట్స్

ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను ఖండించారు మాజీ మంత్రి కొడాలి నాని. పీకే ఒక చిల్లర మనిషి అని కామెంట్స్ చేశారు. ఐప్యాక్ నుండి అతన్ని తన్ని తరిమేశారన్నారు. తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, ఎన్నికల్లో పీకే చెప్పిన జోస్యం ఏమైందని ప్రశ్నించారు.

New Update
Kodali Nani: వైసీపీ ఓడిపోతుందన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యాలపై కొడాలి కామెంట్స్

EX Minister Kodali Nani: ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందన్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను ఖండించారు మాజీ మంత్రి కొడాలి నాని. పీకే ఒక చిల్లర మనిషి అని కామెంట్స్ చేశారు. పీకే తీసేసిన తాసిల్దార్ తో సమానమని.. ఐప్యాక్ నుండి అతన్ని తన్ని తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ లో పార్టీ పెట్టి హడావిడి చేసి డిజాస్టర్ అయిన పీకే.. ఇప్పుడు డబ్బులు తీసుకొని జ్యోతిష్యం చెప్పడం మొదలెట్టాడని ఎద్దేవ చేశారు.

జోస్యం ఏమైంది?..

తెలంగాణ, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, ఎన్నికల్లో పీకే చెప్పిన జోస్యం ఏమైందని ప్రశ్నించారు. లగడపాటి, పీకే లాంటి చిల్లర వ్యక్తులు..తమ వల్ల చంద్రబాబుకు ఒక శాతం ఓటింగ్ అయిన పెంచాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ కోసం పనిచేసే వారితో సీఎం జగన్ సిద్ధం సభలు నిర్వహిస్తున్నారని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో ఎలా గెలుస్తామో ఒంగోలు సభ ద్వారా సీఎం జగన్ చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మా మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాకు 24 గంటలు సరిపోతుందని చెప్పుకొచ్చారు.

Also Read: లంచం కేసుల్లో ఎంపీలు,ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు: సుప్రీంకోర్టు


మూల్యం చెల్లించుకుంటారు..

ఈ క్రమంలోనే జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులకు కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ను రక్షంచుకోవాల్సిన అవసరం జనసేనికులకు అభిమానులకు ఉందన్నారు. చంద్రబాబుకు ఓట్లు కావాలి.. కానీ సీట్లు ఇవ్వరని కామెంట్స్ చేశారు. తాము రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని టార్గెట్ గా పెట్టుకోలేదని 175 స్థానాల్లో గెలవడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. కచ్చితంగా చెబుతున్న పవన్ కళ్యాణ్ ను ఓడించేది టీడీపీనే అని..ఎన్నికల అనంతరం ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

బ్రాండ్ అంబాసిడర్లు..

వెన్నుపోటు కి న్ చంద్రబాబు, నాదెండ్లను పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడన్నారు. అధికారంలో ఉన్న ఎన్టీఆర్ నే కూల్చి పడేసిన చంద్రబాబు, నాదెండ్ల వారికి పవన్ ఎంత అని అన్నారు. 3 శాతం ఓటింగ్ ఉన్న తన సామాజిక వర్గానికి 30 సీట్లు ఇచ్చి..20శాతం ఉన్న వర్గానికి 24సిట్లా అని ప్రశ్నించారు. జనసేనకి ఇచ్చిన సీట్లలో పది కచ్చితంగా ఓడిపోయే సీట్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇవ్వడానికి చంద్రబాబుకి.. తీసుకోవడానికి పవన్ కు సిగ్గుండాలని దుయ్యబట్టారు. కానీ రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న పవన్ సామాజిక వర్గం ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవని కామెంట్స్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు