Kodali Nani: ఎంపీ పదవి కోసమే పురందేశ్వరి ఆరాటం: కొడాలి నాని

ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఎంపీ పదవి కోసం ఆరాటపడుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. బీజేపీని.. టీడీపీకి తాకట్టు పెట్టడానికి పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు.

New Update
Kodali Nani: ఎంపీ పదవి కోసమే పురందేశ్వరి ఆరాటం:  కొడాలి నాని

Kodali Nani: కృష్ణా జిల్లా గుడివాడలో బీసీ సంఘ నాయకుడు దేవరపల్లి కోటితో సహా 150 మంది యువకులు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారన్నారు. చంద్రబాబు సామాజిక వర్గానికే టీడీపీలో ప్రాధాన్యతంటూ కామెంట్స్ చేశారు.

Also Read: కొన్ని వందల కోట్లు ఇచ్చినా.. ఆ పని మాత్రం చేయను..ఇందులో నాకు ఆమెనే ఆదర్శం: కంగనా!

అయితే, అన్ని విభాగాల్లో బీసీలకు 50% పదవులు ఇస్తున్న ఘనత సీఎం జగన్ దెనని కొనియాడారు. చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నాడని దానికి నిదర్శనం గుడివాడేనని ఆరోపించారు. పార్టీ కోసం పని చేసే వారిని కాకుండా.. 150 కోట్లకు గుడివాడ సీటును ఎన్నారైకు అమ్ముకున్నారని ఆరోపించారు.  కానీ, కుక్క కాటుకు చెప్పు దెబ్బలా అమెరికా ఎన్ఆర్ఐకు.. గుడివాడ ప్రజలు బుద్ధి చెప్పారని విమర్శలు గుప్పించారు.

Also Read: ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది?

ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ పదవి కోసమే ఆమె ఆరాటమని చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తుందని పురుందేశ్వరి బాధపడుతున్నారని తెలిపారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారంగానే ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తుందని వివరించారు. పరిమితికి మించి చేసినట్లయితే ఢిల్లీలో ఫిర్యాదు చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. ఎంపీ అవ్వడానికి పురిందేశ్వరి బీజేపీని.. టీడీపీకి తాకట్టు పెట్టడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు.

Advertisment
తాజా కథనాలు