Kodali Nani: సీఎం జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరుగుతుందన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనపై ఆయన స్పందించారు. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల్లో... ఇప్పుడు దాడులు జరిగాయని ఆరోపించారు. సీఎం జగన్ కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కా వ్యూహంతోనే సీఎం జగన్ పై దాడి జరిగిందన్నారు. దుర్మార్గుడు..సైకో జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు చెప్పారన్నారు. కులాన్మాదంతో ముదిరిపోయిన తెలుగు తమ్ముళ్లు.. చంద్రబాబు మాటలు విని సీఎం జగన్ ను చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
Also Read: రంగంలోకి 6 స్పెషల్ టీమ్స్.. జగన్ పై దాడి కేసులో విచారణ ముమ్మరం
దేవుడు దీవెనలు ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్ గాయంతో బయటపడ్డారన్నారు. దాడిని ఖండించాల్సిన పెద్దలు.. సంస్కారహీనంగా సీఎం జగనే తనపై దాడి చేయించుకున్నారని చెప్తున్నారని మండిపడ్డారు. గుర్తింపు పొందిన 9 సంస్థలు చేసిన సర్వేల్లో..125 అసెంబ్లీ స్థానాలు..20 పార్లమెంటు స్థానాలు వస్తాయని చెప్తున్నాయన్నారు. కొందరు రాజకీయ నిరుద్యోగులు విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారన్న కక్షతో.. కొన్ని వర్గాలు కలిసి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేశాయన్నారు.
Also Read: ఆ ప్రతీకారంలో భాగంగానే సల్మాన్ హత్యకు కుట్ర.. తీహార్ జైలు నుంచి సుపారీ!
ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయడానికి ప్రయత్నం జరిగిందంటే.. దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారని పేర్కొన్నారు. ఎంతో పక్కాగా దాడి చేయబట్టే.. సీఎం జగన్ కు తగిలిన రాయి వెల్లంపల్లికి కూడా తగిలి ఆయన గాయపడ్డాడన్నారు. ప్రధాని సీఎం స్థాయి వ్యక్తులు రోడ్ షోగా వెళ్లేటప్పుడు.. పగలైనా రాత్రయినా కరెంటు తీసేస్తారన్నారు. ఆ విషయం సీఎంగా చేసిన చంద్రబాబుకు తెలియదా.. బస్సుపై ఆయన రోడ్ షోలు చేసినప్పుడు కరెంటు తీయలేదా అని ప్రశ్నించారు. సీఎం జగనే కావాలని కరెంటు తీయించారని పిచ్చివాగుడులు వాగుతున్నారన్నారు.