Kodali Nani: అప్పుడు ఎన్టీఆర్‌, వైఎస్సాఆర్‌..ఇప్పుడు జగన్‌!

రాజుగా జన్మించిన అల్లూరి సీతారామరాజు..ఎస్టీల కోసం జీవితాన్ని ఎలా దారపోసారో..అలా ..నాడు ఎన్టీఆర్‌, వైఎస్సాఆర్‌..నేడు సీఎం వైఎస్‌ జగన్‌ బీసీల ఉన్నతికి పాటు పడుతున్నారని వైసీసీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.

New Update
Kodali Nani: అప్పుడు ఎన్టీఆర్‌, వైఎస్సాఆర్‌..ఇప్పుడు జగన్‌!

ఏపీ (AP)  రాజకీయాలు (Politics) రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. అధికార పక్ష నాయకులు, ప్రతిపక్ష నాయకులు మీద విరుచుకుపడుతుంటే..విపక్షాల వారు అధికార పక్షంలో ఉన్న వారిని దూషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో పార్టీలు మారే వారు కూడా ఎక్కువ అయ్యారు.

జంపింగ్‌ నేతలకు రాష్ట్రంలోని పార్టీలు సదర స్వాగతం పలుకుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani)  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ (Jagan) మీద ప్రశంసలు కురిపించారు. కొడాలి నాని బుధవారం బీసీ సంఘ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

రాజుగా జన్మించిన అల్లూరి సీతారామరాజు..ఎస్టీల కోసం జీవితాన్ని ఎలా దారపోసారో..అలా ..నాడు ఎన్టీఆర్‌, వైఎస్సాఆర్‌..నేడు సీఎం వైఎస్‌ జగన్‌ బీసీల ఉన్నతికి పాటు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీసీ జెండా ఆవిష్కరించారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వైసీపీ బీసీలకు పెద్ద పీట వేస్తుందని తెలిపారు.

బీసీ సోదరులంతా ఏకతాటి పైకి వస్తే50 శాతం రిజర్వేషన్లు సాధించవచ్చని నాని పేర్కొన్నారు. కుల గణన వల్ల బీసీలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. వైసీపీ అధికారంలో ఉంటేనే ఏపీలోని బీసీలకు న్యాయం జరుగుతుందని వివరించారు.

Also read: ఒక నిర్ణయం తీసుకున్నాక మీకు చెబుతాను

Advertisment
Advertisment
తాజా కథనాలు