Kodali Nani: కూటమిపై మాజీ మంత్రి కొడాలి నాని రియాక్షన్

టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు ఒకరినొకరు తిట్టుకున్నారని.. ఇప్పుడు సిగ్గు లేకుండా అందరూ కలిసి వస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అట్టర్ ఫ్లాప్ అని అన్నారు.

New Update
Kodali Nani: చీప్ పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఇలా చేస్తున్నాడు.. కొడాలి నాని విమర్శనాస్త్రాలు

Kodali Nani: రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో కలిసి ముందుకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. దీంతో, ఈ కూటమిపై వైసీపీ మంత్రులు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్ధాయిలో దూషించారు. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, బీజేపీ వదినమ్మ పురందేశ్వరి, కాంగ్రెస్ చెల్లెమ్మ షర్మిల , 420 చంద్రబాబు వీరంతా కలిసొచ్చినా సీఎం జగన్ ను ఏమీ చేయలేరని దీమా వ్యక్తం చేశారు.

Also Read: పాపం పవన్ కళ్యాణ్‌.. జనసేనకు ఎందుకు సీట్లు తగ్గించారు.. : అమర్‌నాథ్

ప్రధాని మోదీని చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నో తిట్లు తిట్టారని గుర్తు చేశారు. మోదీని చంద్రబాబు నానా బూతులు తిట్టారని, ఈ దేశాన్ని మోదీ దోచుకున్నారని అన్నారని విమర్శలు గుప్పించారన్నారు. ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్నది పవన్ కళ్యాణ్ కాదా? అని ప్రశ్నించారు. తన తల్లిని దూషించారని., టీడీపీని అంతం చేస్తానని పవన్ కల్యాణ్ గతంలో పలికారని చెప్పుకొచ్చారు.

Also Read: నటి ఐశ్వర్య భర్త శ్యామ్ కుమార్ ఎపిసోడ్ లో ట్విస్ట్.. లైవ్ లో ఫోన్ కాల్స్ వినిపించిన భర్త..!

రాష్ట్రం నాశనమయిందని.. అందకే కలిసినట్టు చెపుతున్నారని.. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నందుకు రాష్ట్రం నాశనం అయిందా అని నిలదీశారు.  ఒకప్పుడు ఒకరినొకరు తిట్టుకున్నారని.. ఇప్పుడు సిగ్గు లేకుండా అందరూ కలిసి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ను ఓడించడమే అన్ని పార్టీల లక్ష్యమని పేర్కొన్నారు. జనసేన పవన్ కల్యాణ్ కు 21 సీట్లకు ఇచ్చారని.. పార్టీని పెట్టింది అమ్ముకోవడానికేనా అని ప్రశ్నించారు. జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అయ్యే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.

Advertisment
తాజా కథనాలు