Kodali Nani: కుక్క కాటుకు చెప్పు దెబ్బలా..

చంద్రబాబు - పవన్ కళ్యాణ్ చేతిలో మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరని కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా.. కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెబుతుందన్నారు.

New Update
Kodali Nani: కుక్క కాటుకు చెప్పు దెబ్బలా..

Kodali Nani: తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్, సీఎం జగన్ ను తొక్కడం కాదు..పవన్ కళ్యాణ్ ను నాశనం చేస్తున్న చంద్రబాబును..80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా..కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెబుతుందని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ జెండా సభలు పెట్టుకుంటున్నారని కామెంట్స్ చేశారు.

Also Read: వైసీపీ ఎన్నికల్లో గెలిచేందుకు ఇలా చేస్తోంది: పురందేశ్వరి

ప్రజలను.. పార్టీను.. పవన్ కళ్యాణ్ ను నమ్ముకొని.. ఆయన ఓటు బ్యాంకుతో చంద్రబాబు గెలవాలన్న స్థాయికి దిగజారాడన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ.. సీఎం జగన్ ను పవన్ కళ్యాణ్ దారుణాతి దారుణంగా తిడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిగా మేము మాట్లాడితే.. పవన్ సామాజిక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. చేసిన మంచిని చెబుతూ..ప్రజలను నమ్మిన సీఎం జగన్..175 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతున్నారని చెప్పుకొచ్చారు. 14 ఏళ్ల అధికారం వెలగబెట్టిన చంద్రబాబు.. ఐదేళ్లు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ మా పాలను చూసి ఓటెయ్యండని అడగలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవ చేశారు.

Also Read: ఫ్లవర్ రోజా..ప్రజల చెవిలో పువ్వులు పెట్టొద్దు: రవినాయుడు

చంద్రబాబు తమ సామాజిక వర్గానికి 21 సీట్లు ప్రకటించారని.. మరో 10 స్థానాలు ఇవ్వనున్నారని తెలిపారు. మూడు శాతం ఓటింగ్ ఉన్న వర్గానికి 31 సీట్లు ఇస్తే..తమకు 20శాతం ఓటింగ్ ఉందని చెబుతున్న జనసేన పార్టీ శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎన్ని సీట్లు ఇవ్వాలని ప్రశ్నించారు. 24 సీట్లతో తాము సంతృప్తిగా లేమని జనసైనికులు బహిరంగంగానే చెబుతున్నారన్నారు. తనపై సింపతీ క్రియేట్ చేసుకొని తన సామాజిక వర్గ ఓట్ల ద్వారా చంద్రబాబును సీఎం చేయడానికే.. పవన్ కళ్యాణ్ యుద్ధం మొదలుపెట్టినట్లు ఫీల్ అవుతున్నారని కామెంట్స్ చేశారు. చంద్రబాబు - పవన్ కళ్యాణ్ చేతిలో మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరని పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు