Kodali Nani: కేవలం నాలుగు వారాల బెయిలుకే ఇంత బిల్డప్ ఎందుకు?

చంద్రబాబు బెయిల్ పై రిలీజ్ అవ్వడంతో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, కేవలం నాలుగు వారాల బెయిలుకే ఇంత సంబరాలు ఎందుకోనని ట్వీట్టర్ వేదికగా స్పందించారు మాజీ మంత్రి కొడాలి నాని. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నిర్దోషి అని కోర్టు చెప్పలేదని తెలిపారు. ఆరోగ్య కారణాలను సాకుగా చూపడం వల్ల బెయిల్ వచ్చిందని కౌంటర్ చేశారు.

New Update
Kodali Nani: కేవలం నాలుగు వారాల బెయిలుకే ఇంత బిల్డప్ ఎందుకు?

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.  చంద్రబాబుకు బెయిల్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా  తెలుగు తమ్ముళ్లు ఆనందంలో మునిగి తేలుతున్నారు. రోడ్లపైకి వచ్చి  బాణాసంచా కాలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు మళ్ళీ వచ్చాడని, బాబు ఈజ్ బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

Also Read: చంద్రబాబుకు బెయిల్ రావడంపై పవన్ కళ్యాణ్ రియాక్షన్‌ ఇదే.!

ఇదిలా ఉండగా..టీడీపీ శ్రేణుల సంబరాలపై వైసీపీ నేతలు, మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ సెటైర్లు వేశారు. నిజం గెలిచింది కాబట్టి చంద్రబాబుకు బెయిల్ రాలేదని, చంద్రబాబుకు కళ్లు కనిపించడంలేదు కాబట్టే బెయిల్ వచ్చిందని పోస్ట్ చేశారు. తాజాగా, ఇదే అంశంపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ట్వీట్టర్ వేదికగా స్పందించారు. చంద్రబాబుకు కోర్టు ఇచ్చింది కేవలం నాలుగు వారాల పాటు పలు షరతులతో కూడిన బెయిల్ అని కొడాలి నాని అన్నారు. అది కూడా ఆరోగ్య కారణాలను సాకుగా చూపడం వల్ల ఇచ్చిందని ఎద్దెవ చేశారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నిర్దోషి అని కోర్టు చెప్పలేదని తెలిపారు. ఈ మాత్రం దానికే టీడీపీ నాయకుల సంబరాలు ఎందుకోనని కౌంటర్ చేశారు.

చంద్రబాబు తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. నవంబర్‌ 24 వరకు షరతులతో కూడిన బెయిల్‌ ను ఇచ్చింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. నవంబర్‌ 24న బాబు తిరిగి సరండర్‌ కావాలని ఆదేశించింది. దాంతో పాటు బెయిల్ మీద బయటకు వెళ్లాక ఆస్పత్రికి వెళ్లడం మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని, ఫోన్‌లో మాట్లాడకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నవంబర్ 10న మెయిన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని తెలిపింది హైకోర్టు.

Advertisment
తాజా కథనాలు