Kodali Nani: కొడాలి నాని నామినేషన్.. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా.. కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి గుడివాడలో విజయం సాధిస్తానన్నారు. కుక్కకాటుకు చెప్పు దెబ్బలా ఎన్నికల్లో చంద్రబాబుకు.. ఆయనను నమ్ముకున్న NRI లకు గుణపాఠం తప్పదన్నారు. By Jyoshna Sappogula 25 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Kodali Nani Filed Nomination: కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని నామినేషన్ వేశారు. రాజేంద్రనగర్ లోని తన స్వగృహం నుండి వేలాది మంది పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి గుడివాడలో విజయం సాధిస్తానన్నారు. గత ఎన్నికల్లో వచ్చిన 20వేల కంటే ఈ సారి ఎక్కువ మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గుణపాఠం తప్పదు.. కుక్కకాటుకు చెప్పు దెబ్బలా ఎన్నికల్లో చంద్రబాబుకు (Chandrababu)... ఆయనను నమ్ముకున్న NRI లకు గుణపాఠం తప్పదన్నారు. మళ్ళీ జగనే సీఎం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారన్నారు. టీడీపీకి చెందిన కొంత మంది..చంద్రబాబు..కోడి గుడ్డుకు ఈకలు పికినట్లు.. రాద్దాంతం చేస్తున్నారన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో అకడక్కడ టీడీపీ వాళ్ళు రెచ్చ కొడుతున్న తాము సమన్వయంతో ఉన్నామన్నారు. Also Read: జగన్ ది గులకరాయి డ్రామా.. బుగ్గనకు బైరెడ్డి శబరి సవాల్..! 151 సీట్లు దాటుతాయి.. 2014లో చంద్రబాబు ప్రజలను ఏ విధంగా మోసం చేశారో....మళ్ళీ అవే మోసాలతో ఎన్నికలకు వెళ్తున్నారన్నారు. పరాయి దేశంలో డబ్బు సంపాదించుకుని...అక్కడ సంపాదించిన సొమ్ము మదంతో గుడివాడలో రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు NRI లకు టీడీపీ సీట్లను అమ్ముకున్నారని..డబ్బు సంచులతో వచ్చిన NRI లు రిజల్ట్స్ తర్వాత రిటర్న్ టిక్కెట్ తో వెళ్లి పోతారన్నారు. 20ఏళ్లు ఎక్కడ ఉన్నాడో తెలియని వ్యక్తి..చంద్రబాబు దగ్గర టిక్కెట్ కొనుక్కొని..గుడివాడలో పోటీ చేస్తున్నారన్నారు. సీఎం జగన్ కు ఈ సారి 151సీట్లు దాటుతాయన్నారు. #kodali-nani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి