/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/PF-Balance-jpg.webp)
PF Balance : సంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(Employees Provident Fund Organization)లో PF ఖాతాను తెరవాల్సిందే. ఈ PF ఖాతాలో, ఉద్యోగి పదవీ విరమణ కోసం డబ్బులను తీస్తారు. దానిలో కొంత భాగాన్ని ఉద్యోగి, యజమాని ప్రతి నెలా జమ చేస్తారు. ఈ బ్యాలెన్స్‌ను ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం చివరిలో ఇస్తుంది.PF ఖాతాలో బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే, మీరు EPFO వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఇక్కడ మీరు అనేక దశలను అనుసరించిన తర్వాత మీ PF బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఈ ఆర్టికల్‌లోమీకు PF బ్యాలెన్స్‌ని తెలుసుకోవడానికి సింపుల్ టిప్స్ చెబుతాము. దీని ద్వారా మీరు క్షణాల్లో PF బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
ఒక్క క్లిక్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఎలా?
EPFO వెబ్‌సైట్‌కి వెళ్లకుండానే PF బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే, మీరు Umang యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇది అనేక ప్రభుత్వ సేవలు డిజిటల్‌గా అందుబాటులో ఉండే ప్రభుత్వ యాప్. ఈ యాప్‌లు ఆండ్రాయిడ్, యాపిల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఉమంగ్ యాప్‌లో పీఎఫ్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలి?
-ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి..దాన్ని ఓపెన్ చేయండి.
-ఇక్కడ మీరు మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా లాగిన్ అవ్వాలి.
-ఇప్పుడు సెర్చ్ బార్‌కి వెళ్లి EPFO అని టైప్ చేయండి.
-ఆ తర్వాత EPFO పేజీ ఓపెన్ అవుతుంది.
-ఇక్కడ క్రిందికి స్క్రోల్ చేస్తే మీకు ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ విభాగం కనిపిస్తుంది.
-ఇందులో మొదటి నంబర్‌లో ఉన్న వ్యూ పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి.
-దీని తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ విజిట్ సర్వీస్ పై క్లిక్ చేయండి.
-ఇప్పుడు మీరు మీ UANని నమోదు చేసి, GET OTPపై క్లిక్ చేయాలి.
-మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.
-దీని తర్వాత మీ పాస్‌బుక్ కనిపిస్తుంది. ఇందులో మీ వివరాలు అన్ని ఉంటాయి.
ఇది కూడా చదవండి: రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి..!!