CM KCR: కేసీఆర్‌కు సొంత కారు కూడా లేదు.. ఆస్తుల వివరాలు చూస్తే షాకే..!

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఆస్తులు, అప్పులు, ఆయనపై ఉన్న కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. కేసీఆర్ కు సొంతంగా కారు, భూమి ఏదీ లేదని పేర్కొన్నారు.

New Update
CM KCR: కేసీఆర్‌కు సొంత కారు కూడా లేదు.. ఆస్తుల వివరాలు చూస్తే షాకే..!

CM KCR Properties and Assets 2023: ఆయన జాతీయ పార్టీకి అధ్యక్షుడు.. అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రి.. కానీ, ఆయన పేరిట సెంటు భూమి కూడా లేదు. తిరగడానికి ఒక కారు కూడా లేదు. ఆయనెవరో కాదు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR). అవును, తన వృత్తే వ్యవసాయంగా చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎన్నికల అఫిడవిట్లో తనకు సెంటు భూమి కూడా లేదని పేర్కొన్నారు. అయితే, భూములు, ఆస్తులన్నీ కుటుంబ ఉమ్మడి ఆస్తులుగానే ఉన్నట్లు పేర్కొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ అఫిడవిట్ ప్రకారం.. గడిచిన ఐదేళ్లలో కేసీఆర్ బ్యాంక్ డిపాజిట్లు డబుల్ అయ్యాయి. గత ఎన్నికల సమయంలో అంటే 2018 డిసెంబర్ సమయానికి బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ. 5.63 కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ. 11.16 కోట్లు ఉన్నాయి. ఆయన భార్య శోభ పేరిట ప్రస్తుతం రూ. 6.29 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు కేసీఆర్. ఇక బంగారు ఆభరణాలు రూ. 2.8 కిలోలు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇక ఈ ఏడాది జులై నెలలో మర్కూర్ మండలంలోని శివారు వెంకటాపురం గ్రామంలో 10 ఎకరాల సాగుభూమిని కొనుగోలు చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు సీఎం కేసీఆర్. దీని విలువ సుమారు.. రూ. 28.47 లక్షలుగా పేర్కొన్నారు. స్థిర, చరాస్తుల రూపంలో కేసీఆర్‌కు రూ. 17.83 కోట్లు, 8.50 కోట్ల విలువైన ఆస్తులు ఉంటే.. ఆయన భార్య శోభ పేరిట రూ. 7.78 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇక ఆయన కుటుంబానికి సంబంధించి ఉమ్మడి ఆస్తులు.. స్థిరాస్తులు 9.81 కోట్లు, చరాస్తులు రూ. 15 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇక తన పేరు మీద రూ. 17.27 కోట్లు అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు కేసీఆర్. తన కుటుంబం పేరు మీద రూ. 7.23 కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. అంతేకాదు, ఆయనకు సొంతంగా కారు, బైక్ ఏదీ లేదు. ఉమ్మడి కుటుంబం పేరిట ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీ తదితర 14 వాహనాలున్నాయని తెలిపారు. మార్కెట్ ప్రకారం వీటి విలువ.. రూ. 1.16 కోట్లు ఉంది. మొత్తంగా చూసుకుంటే.. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం పేరిట 53.30 ఎకరాల సాగుభూమి, 9.36 కరాల మేర వ్యవసాయేతర భూములున్నాయి. ఆయనపై 9 కేసులు కూడా నమోదయ్యాయి.

కామారెడ్డి, గజ్వేల్‌ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ వేసిన అఫిడవిట్ ప్రకారం ఆస్తుల వివరాలు సంక్షిప్తంగా..

కల్వకుంట్ల కేసీఆర్..

స్థిరాస్తులు: రూ.8.50 కోట్లు
చరాస్తులు: రూ.17,83,87,492
రుణాలు : రూ.17,27,61,818
నగదు : రూ.2,96,605
బంగారం, వెండి: రూ.17.40 లక్షలు విలువ చేసే బంగారం వెండి ఉంది.
వాహనాలు : లేవు
కేసులు : 9

కేసీఆర్ భార్య శోభ పేరిట ఆస్తులు..

స్తిరాస్తులు: రూ.7,78,24,488
చరాస్తులు: లేవు
అప్పులు: లేవు
నగదు: లేదు
ఆభరణాలు: రూ.1,49,16,084
వాహనాలు: లేవు

ఉమ్మడి కుటుంబ ఆస్తుల వివరాలు..

స్థిరాస్తులు: రూ.9,81,19,820
చరాస్తులు: రూ.15 కోట్లు
రుణాలు : రూ.7,23,51,813
నగదు : రూ.1,19,011
బంగారం, వెండి: లేవు
వాహనాలు: గూడ్స్, ట్రాక్టర్స్, హార్వెస్టర్స్(రూ. 1,16,72,256)

Also Read:

కేసీఆర్, రేవంత్, కిషన్ రెడ్డి.. సారథుల పొలిటికల్ హిస్టరీ..

మంత్రి కేటీఆర్‌కు ప్రమాదం.. గాయాలు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు