Changes From February 1st: బీ ఎలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి వచ్చే ఈ మార్పుల గురించి తెలుసుకోండి.. 

ప్రతి నెలా అనేక అంశాలలో మార్పులు వస్తుంటాయి. ఆర్ధిక విషయాల్లో వచ్చే మార్పులను ముందుగానే తెలుసుకోవడం మంచింది. ఫాస్టాగ్ కేవైసీ, సావరిన్ గోల్డ్ బాండ్, IMPS వంటి విషయాల్లో  ఫిబ్రవరి 1 నుంచి మార్పులు రాబోతున్నాయి. వాటి గురించి వివరంగా ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి 

Changes From February 1st: బీ ఎలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి వచ్చే ఈ మార్పుల గురించి తెలుసుకోండి.. 
New Update

Changes From February 1st: ఫిబ్రవరి నెల ప్రారంభం అవ్వడానికి మూడు రోజులు మాత్రమే ఉంది. ప్రతి నెలా చాలా విషయాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే మరి ఫిబ్రవరి నెలలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. వీటిని మనం గమనించడం అవసరం. ఎందుకంటే వీటిని ముందుగా తెలుసుకోకపోతే, నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ మార్పులను తెలుసుకుని.. మారే రూల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చేస్తే అన్నివిధాలుగానూ ఇబ్బందులు లేకుండా బయటపడవచ్చు. అలాంటి మార్పులు ఏమేం చేయాలో అర్ధం చేసుకుందాం. 

ప్రతి నెలా కొన్ని మార్పులు ఆర్థిక పరంగా దేశంలో చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు ప్రతి నెల ప్రారంభం నుండి అమలులోకి వస్తాయి. ఇప్పుడు మరో 3 రోజుల్లో ఫిబ్రవరి నెల(Changes From February 1st) ప్రారంభం కానుంది. డబ్బుకు సంబంధించిన కొన్ని కొత్త మార్పులు కూడా ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. వీటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), తక్షణ చెల్లింపు సేవ (IMPS), ఫాస్టాగ్, సావరిన్ గోల్డ్ బాండ్, SBI హోమ్ లోన్, పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్ స్పెషల్ FD ఉన్నాయి. నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాలను మరింత తెలుసుకుందాం.. 

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) ఎన్‌పిఎస్ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసే నిబంధనలను మార్చింది. ఫిబ్రవరి 1 నుంచి(Changes From February 1st) కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం జనవరి 12వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త రూల్ ప్రకారం, NPS డిపాజిట్ల నుంచి కేవలం 25% మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా, డబ్బును ఉపసంహరించుకోవాలంటే, మీ ఎకౌంట్ 3 సంవత్సరాల కంటే ఎక్కువ పాతది అయి ఉండాలి.

తక్షణ చెల్లింపు సేవ (IMPS)

Changes From February 1st: మీరు డబ్బు పంపాలనుకుంటున్న వ్యక్తి పేరును జోడించకుండానే మీరు IMPS ద్వారా రూ. 5 లక్షల వరకు బదిలీ చేయవచ్చు. దీని కోసం ఖాతా నంబర్ - మొబైల్ నంబర్ మాత్రమే అవసరం అవుతుంది. 

ఫాస్టాగ్‌..

NHAI కొత్త నిబంధనల ప్రకారం, ఫాస్టాగ్‌లో KYC తప్పనిసరి కానుంది. వాహనం ఫాస్టాగ్ KYC ఈ నెలాఖరులోగా అంటే జనవరి 31 లోగ చేయకపోతే, అది ఫిబ్రవరి 1 నుంచి(Changes From February 1st) నిరుపయోగంగా మారుతుంది.

Also Read : తగ్గినట్లే తగ్గి పెరిగిన బంగారం.. తగ్గేదేలే అంటున్న వెండి!

సావరిన్ గోల్డ్ బాండ్ (SGB)

వచ్చే నెలలో సావరిన్ గోల్డ్ బాండ్‌లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. మీరు 12 ఫిబ్రవరి నుండి 16 ఫిబ్రవరి 2024 వరకు SGBలో పెట్టుబడి పెట్టె అవకాశం కల్పించవచ్చు. 

గృహ రుణంపై SBI ప్రత్యేక ఆఫర్

ప్రస్తుతం SBI గృహ రుణంపై 0.65 శాతం తగ్గింపు ఇస్తోంది. అయితే ఈ తగ్గింపు జనవరి 31తో ముగుస్తుంది. అంతేకాకుండా ప్రాసెసింగ్ ఫీజులో తగ్గింపు కూడా ఉంది. ఇది కూడా ముగియనుంది.

పంజాబ్, సింధ్ బ్యాంక్ ప్రత్యేక FD

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్  444 రోజుల ప్రత్యేక FD (ధన్ లక్ష్మి 444 రోజులు)పై 7.60 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. ఈ FD పథకం కూడా జనవరి 31, 2024న ముగుస్తుంది.

Watch this interesting Video:

#february #fastag
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe