Eating Disorders: ఎక్కువగా తినాలనిపిస్తోందా? అయితే జాగ్రత్త తప్పదు..

ఎక్కువగా తినాలనిపించడం.. ఒక రకమైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. దీనిని ఈటింగ్ డిజార్డర్ అంటారు. ఈ సమస్యను మానసిక నిపుణులను సంప్రదించడం, కౌన్సెలింగ్ థెరపీ, కాగ్నిటివ్ థెరపీ అలాగే అవసరమైతే, కొన్ని మందులు కూడా ఇవ్వడం ద్వారా నయం చేయవచ్చు.

New Update
Eating Disorders: ఎక్కువగా తినాలనిపిస్తోందా? అయితే జాగ్రత్త తప్పదు..

Eating Disorders: ప్రతి ఒక్కరూ వివిధ రకాల ఆహారాలను రుచి చూడాలని కోరుకుంటారు. తిండికి పెద్దపీట వేసే వారు చాలా మంది ఉంటారు. ఏదైనా చూస్తే వెంటనే తినేయాలని తొందరపడేవాళ్ళను చాలామందిని చూస్తుంటాం. ఏది దొరికితే అది తినేస్తూ ఉంటారు. చూసేవాళ్ళు.. పక్కన ఉన్నవాళ్లు తిండిపోతులు అని ఎగతాళి చేసినా తినాలనే కోరికను చంపుకోలేకపోతూ ఉంటారు.  ఇది మనకు సాధారణమైనదిగా అనిపించినప్పటికీ, ఆరోగ్యంగా ఉండటానికి మన ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. చాలా సార్లు మనం దానిని గ్రహించలేం.  ఈ విధంగా తిండి మీద ఎక్కువ ధ్యాస పెట్టేవారిని ఈటింగ్ డిజార్డర్(Eating Disorders) తో బాధపడుతున్నారని అంటారు. ఈ రుగ్మత మొత్తం ఆరోగ్యాన్ని చెడుగా ప్రభావితం చేస్తుంది.

ఈ తినే రుగ్మత అంటే ఈటింగ్ డిజార్డర్(Eating Disorders) ఎవరికైనా రావచ్చు. అయినప్పటికీ, చిన్న వయస్సులోనే తినే రుగ్మతలు అభివృద్ధి చెందడం ఎక్కువగా కనిపిస్తుంది. దీని వెనుక జన్యుపరమైన కారణం కూడా ఉండవచ్చు (కుటుంబంలో ఎవరికైనా సమస్య ఉండవచ్చు). ఈ సమస్యపై దృష్టి సారిస్తే అదుపులో ఉంచుకోవచ్చు. ఈ ఈటింగ్ డిజార్డర్ గురించి నిపుణులు ఏమంటున్నారు తెలుసుకుందాం.. 

శారీరక, మానసిక సమస్యల బారిన పడవచ్చు
ఈటింగ్ డిజార్డర్స్(Eating Disorders) గురించి చెప్పాలంటే, వీటిలో అనోరెక్సియా నెర్వోసా (లావుగా అనిపించడం వల్ల ఆహారాన్ని నివారించడం), బులీమియా నెర్వోసా (అతిగా తినడం), ఇది కాకుండా, బింజ్ ఈటింగ్ డిజార్డర్ (తక్కువ సమయంలో ఎక్కువ తినడం), పికా ఈటింగ్ డిజార్డర్. (మట్టి, సుద్ద, ఐస్, కాగితం వంటివి తినడం). ఇది మానసిక రుగ్మత అని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో సతమతమవుతున్న వారిలో ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా గుండె జబ్బులు, జీర్ణకోశం, థైరాయిడ్ తదితర శారీరక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

Also Read: చాలా మంది మహిళలు భావప్రాప్తి పొందినట్టు నటిస్తారు..ఎందుకంటే!

వైద్యులు ఏమి చెబుతారు
వైద్యులు చెబుతున్నదాని ప్రకారం ఈటింగ్ డిజార్డర్(Eating Disorders) అనేది ఒక రకమైన మానసిక సమస్య, దీని కారణంగా రోగి తినడం మానేయడం లేదా శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం ప్రారంభిస్తాడు. దీని కారణంగా, బరువు వేగంగా పెరుగుతుంది లేదా తగ్గుతుంది. కొంతమంది పిల్లలకు పుట్టినప్పటి నుంచి కూడా ఈ సమస్య ఉండవచ్చు.

తినే రుగ్మతకు చికిత్స ఏమిటి?
ఈటింగ్ డిజార్డర్(Eating Disorders) అనేది నయం చేయలేని వ్యాధి కాదు, కానీ దానిని నయం చేయవచ్చు. ఎవరైనా ఈ రుగ్మతకు గురైనట్లయితే, మానసిక నిపుణులను సంప్రదించడం, కౌన్సెలింగ్ థెరపీ, కాగ్నిటివ్ థెరపీ అలాగే అవసరమైతే, కొన్ని మందులు కూడా ఇవ్వడం ద్వారా నయం చేయవచ్చు.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు