Corporate FD: స్టాక్ మార్కెట్ రిస్క్‌ల నుండి దూరంగా సురక్షితమైన పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి FD ఉత్తమ పెట్టుబడి ఎంపిక. మార్కెట్ అస్థిరత నుండి తమ సేవింగ్స్ ను కాపాడుకోవాలనుకునే పెట్టుబడిదారులకు FD ఎప్పుడూ ఒక పెద్ద పెట్టుబడి. బ్యాంకులు, NBFCలు (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు), కార్పొరేట్‌లు, పోస్టాఫీసులు సామాన్యులు- సీనియర్ సిటిజన్‌ల కోసం అనేక రకాల FDలను అందిస్తాయి.
కార్పొరేట్ FDలో రేటింగ్‌లు..
Corporate FD: కార్పొరేట్ ఎఫ్‌డిని ఎంచుకునేటప్పుడు చాలా విషయాలను గుర్తుంచుకోవాలి. ఇందులో ముఖ్యమైనది FD రేటింగ్. ఏదైనా FD దాని వడ్డీ రేటు, తిరిగి చెల్లించే సౌకర్యం మొదలైన వాటి ఆధారంగా రేటింగ్ ఇస్తారు. అధిక రేటింగ్, FD సురక్షితంగా ఉంటుంది. CRISIL, ICRA - ఇతర రేటింగ్ ఏజెన్సీలు ఈ కార్పొరేట్‌ల గురించి సవివరమైన సమాచారాన్ని పొందిన తర్వాత
FDలకు రేటింగ్‌లు ఇస్తాయి..
Also Read: స్టాక్ మార్కెట్ జూన్ 4 తరువాత పరుగులు తీస్తుందంటున్న పీఎం మోదీ
ఈ FDలు టాప్ రేటింగ్‌లను కలిగి ఉన్నాయి
Corporate FD: NBFCలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు అందించే FD పథకాలను కార్పొరేట్ FD లేదా కంపెనీ FD అని కూడా అంటారు. paisabazaar.com ద్వారా వచ్చిన డేటా ఆధారంగా, రేటింగ్‌ల ప్రకారం AAA లేదా AA+ అధిక రేటింగ్‌లు కలిగిన టాప్ 5 కార్పొరేట్ FDల గురించి ఇప్పుడు మనం చూద్దాం.
- బజాజ్ ఫైనాన్స్
Corporate FD: బజాజ్ ఫైనాన్స్ 12 నెలల నుండి 60 నెలల కాల వ్యవధిలో 7.4 శాతం నుండి 8.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది, సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
రేటింగ్: CRISIL-AAA/స్టేబుల్ ICRA-AAA/స్టేబుల్
- మహీంద్రా ఫైనాన్స్
Corporate FD: మహీంద్రా ఫైనాన్స్ 12 నెలల నుండి 60 నెలల వరకు 7.6 శాతం నుండి 8.05 శాతం వడ్డీ రేటును అందిస్తోంది, సీనియర్ సిటిజన్లకు 0.25 శాతం అదనపు వడ్డీ రేటును అందిస్తోంది.
రేటింగ్‌లు: CRISIL-AAA/స్టేబుల్ ICRA-AAA/స్టేబుల్
- సుందరం హోమ్ ఫైనాన్స్
సుదర్శన్ హోమ్ ఫైనాన్స్ 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు 7.9 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే ఇది సీనియర్ సిటిజన్లకు 30 bps వరకు అదనపు వడ్డీ రేటును అందిస్తోంది.
రేటింగ్‌లు: CRISIL-AAA/స్టేబుల్ ICRA-AAA/స్టేబుల్
- LIC హౌసింగ్ ఫైనాన్స్
Corporate FD: LIC హౌసింగ్ ఫైనాన్స్ 5 సంవత్సరాల వరకు 7.25 శాతం నుండి 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది, సీనియర్ సిటిజన్లు 25 bps అదనపు వడ్డీ రేటును పొందుతున్నారు.
రేటింగ్‌లు: CRISIL-AAA/స్టేబుల్
- ICICI హోమ్ ఫైనాన్స్
Corporate FD: ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ సాధారణ కస్టమర్లకు 60 నెలల వరకు 7.25 శాతం నుండి 7.6 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 0.25 శాతం అదనపు వడ్డీ రేటును అందిస్తోంది.