Budget 2024 : బడ్జెట్ లో ఉపయోగించే ఈ పదాల అర్ధం తెలుసుకోండి

మరో మూడురోజుల్లో బడ్జెట్ రానుంది. బడ్జెట్ లో ఉపయోగించే కొన్ని పదాలకు అర్ధాలు మనలో చాలామందికి తెలియవు. వాటిలో ముఖ్యమైన 10 పదాల అర్ధాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు. 

Budget 2024: బడ్జెట్ కు ముందే  మోదీ సర్కార్ గుడ్ న్యూస్...భారీగా తగ్గనున్న వీటి ధరలు..!!
New Update

Budget Terminology : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​(Nirmala Sitharaman).. ఫిబ్రవరి 1న 2024 బడ్జెట్​ని ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఈసారి మధ్యంతర బడ్జెట్(Interim Budget) పార్లమెంట్ ముందుకు రాబోతోంది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్ధిక మంత్రి చేసే ప్రసంగంలో అనేక ముఖ్యమైన పదాలు ఉంటాయి. వీటిలో చాలా మందికి అర్ధం కావు. ఈ  బడ్జెట్​ ‘టర్మినాలజీ’  అర్ధం చేసుకోవడం అవసరమే. ఎందుకంటే ఈ టెర్మినాలజీ తెలిస్తేనే బడ్జెట్ లోని అంశాల గురించి సులువుగా అర్ధం చేసుకోగలుగుతాం. నిర్మలా సీతారామన్​ ప్రసంగానికి ముందు.. మనం  తెలుసుకోవాల్సిన 10 బడ్జెట్​ టర్మ్స్​ ఇవే..

బడ్జెట్​ టర్మినాలజీ- వాటి అర్థాలు..

పన్ను మినహాయింపు: ఈ పదం(Budget Terminology) సూచించినట్లుగా, మీరు చెల్లించాల్సిన ట్యాక్స్​ మొత్తాన్ని తగ్గించడానికి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి మినహాయించాల్సిన మొత్తమే పన్ను మినహాయింపు. ఉదాహరణకు పన్ను చెల్లింపుదారులు రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మొత్తం ఆదాయంలో 50 వేల రూపాయల వరకూ పన్ను చెల్లించనవసరం ఉండదు. దీనికి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉండదు. అదే విధంగా పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు గరిష్టంగా రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు (సెక్షన్ 80సీ కింద) పొందవచ్చు.

రిబేట్: టోటల్​ ఇన్​కమ్​ ట్యాక్స్​(Income Tax) లో తగ్గింపును రిబేట్​ అంటారు. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించడానికి మినహాయింపు అనుమతించినట్లే, రిబేట్​తో.. పన్ను చెల్లింపుదారులు తమ పన్ను భాగాన్ని రిబేటు మొత్తంతో తగ్గించడానికి వీలు కల్పిస్తుంది. ఇది సాధారణంగా పన్ను చెల్లింపుదారుల పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను ఉత్తేజపరచడానికి ప్రోత్సహిస్తారు.

టాక్స్ పై సర్ ఛార్జ్ : రూ.50 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి సర్ ఛార్జ్ వర్తిస్తుంది. ఇది చెల్లించాల్సిన పన్నుకు వర్తిస్తుంది తప్ప మొత్తం ఆదాయానికి వర్తించదు. 30 శాతం పన్ను రేటుపై 10 శాతం సర్ ఛార్జ్ విధిస్తారు.  తద్వారా మొత్తం కట్టాల్సిన పన్ను 33 శాతానికి పెరుగుతుంది.

టాక్స్ పై సెస్: ఇది ఆరోగ్యం- విద్య(Health-Study) వంటి నిర్దిష్ట ప్రయోజనాల కోసం నిధులను సేకరించడానికి ఆదాయపు పన్నుపై విధించే పన్ను(Budget Terminology). ప్రస్తుతం సెస్ రేటు 4 శాతంగా ఉంది. ఇది.. అన్ని ఆదాయ శ్లాబులకు వర్తిస్తుంది. సర్ ఛార్జ్ తో సహా ట్యాక్స్​ లయెబులిటీపై సెస్ వసూలు చేస్తారు. ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకోవడానికి తగినంత డబ్బును కూడబెట్టిన తరువాత మాత్రమే దీనిని ఆపుతారు. 

కొత్త పన్ను విధానం: ఇది ఏడు పన్ను శ్లాబులతో కూడిన తాజా పన్ను విధానం. 2022లో దీనిని ప్రవేశపెట్టారు. రూ.15 లక్షలకు పైబడిన ఆదాయంపై గరిష్టంగా 30 శాతం పన్ను రేటు వర్తిస్తుంది. కానీ దీని వలన చాలా పన్ను మినహాయింపులు లేకుండా పోయాయి.  2023-24 ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానం డిఫాల్ట్ ట్యాక్స్ విధానంగా మారింది.

Also Read : తగ్గినట్లే తగ్గి పెరిగిన బంగారం.. తగ్గేదేలే అంటున్న వెండి!

పాత పన్ను విధానం: ఇందులో నాలుగు పన్ను శ్లాబులు(Budget Terminology) ఉంటాయి. మునుపటి పన్ను విధానం, రూ .10 లక్షలకు పైగా ఆదాయంపై అత్యధికంగా 30 శాతం పన్ను రేటు వర్తిస్తుంది. కొత్త పన్ను విధానంలో దశలవారీగా తొలగించిన అన్ని పన్ను మినహాయింపులను ఈ విధానంలో అందిస్తారు.

టీడీఎస్: ఇన్​కమ్​ సోర్స్​ వద్ద పన్ను సేకరించేదే ఈ టీడీఎస్​.

ట్యాక్స్ సేవింగ్ సాధనాలు: పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్నులో మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి అర్హత కల్పించే పొదుపు సాధనాలు పీపీఎఫ్, ఎన్ఎస్సీ, ఎన్పీఎస్. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపులు అనేకం ఇకపై అనుమతించడం లేదని గుర్తుపెట్టుకోవాలి.

టీసీఎస్: ఇది కూడా ఇన్​కమ్ సోర్స్​ వద్ద విధించే ట్యాక్స్​. అమ్మకం సమయంలో కొనుగోలుదారు నుంచి అమ్మకందారుడు పన్ను రూపంలో సేకరించిన అదనపు మొత్తాన్ని అధికారుల వద్ద డిపాజిట్​ చేస్తారు. ఉదాహరణకు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలకు మించి జమ చేయాలనుకునే వారు కొన్ని సందర్భాల్లో తప్ప 20 శాతం టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది.

వీడీఏ: 2022లో ప్రవేశపెట్టిన పన్ను ఫ్రేమ్​వర్క్​ పరిధిలోకి వచ్చే డిజిటల్ ఆస్తులు ఇవి. అమ్మకం, కొనుగోళ్లపై ఒక శాతం టీడీఎస్, మూలధన లాభాలపై 30 శాతం వంటివి ఇందులో ఉంటాయి. వీడీఏల్లో బిట్ కాయిన్, ఎథేరియం, డోజ్​కాయిన్ తదితర డిజిటల్ కరెన్సీలు ఉన్నాయి.

Watch this interesting Video:

#interim-budget-2024 #2024-budget-expectations #union-budget-2024 #budget-terminology
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe