చిరంజీవి మోకాలికి ఆపరేషన్ పూర్తి.. ఈనెల 20న హైదరాబాద్‌కు రాక మెగాస్టార్ చిరంజీవి మోకాలికి ఆపరేషన్ పూర్తి అయింది. కొన్నిరోజులుగా ఢిల్లీలో ఉన్న చిరు.. అపోలో ఆసుపత్రిలో తన మోకాలికి చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీలోనే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈనెల 20న హైదరాబాద్‌కు రానున్నారు. By BalaMurali Krishna 18 Aug 2023 in సినిమా New Update షేర్ చేయండి మెగాస్టార్ చిరంజీవి మోకాలికి ఆపరేషన్ పూర్తి అయింది. కొన్నిరోజులుగా ఢిల్లీలో ఉన్న చిరు.. అపోలో ఆసుపత్రిలో తన మోకాలికి చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీలోనే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈనెల 20న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ శస్త్రచికిత్సను వైద్య పరిభాసలో ఆర్థ్రోస్కోపిక్ నీ వాషౌట్ అని అంటారు. మోకాలిలో ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఈ శస్త్రచికిత్స ద్వారా ఆర్థోప్లాస్టీ చేసి క్లియర్ చేస్తారు. దీనికి పెద్దగా విశ్రాంతి అవసరం లేదు. వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కొన్నిరోజులుగా చిరంజీవికి మోకాలికి శస్త్ర చికిత్స జరగనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో మెగాస్టార్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కానీ చిన్న సర్జరీ అని స్పష్టత రావడంతో అన్నయ్య త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు. Your browser does not support the video tag. ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మెగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అజిత్ నటించిన తమళి మూవీ వేదాళం మూవీకు రీమేక్‌గా వచ్చిన భోళా శంకర్ తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో మెహర్ రమేష్ ఎలాంటి కొత్తదనం చూపించకపోవడంతో పాటు అనవసరమైన కామెడీ సీన్లు పెట్టడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. భోళాశంకర్ తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.33 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓపెనింగ్ వసూళ్లు బాగానే వచ్చినా సినిమాకు వచ్చిన డిజాస్టర్ టాక్‌తో రెండో రోజు నుంచే కలెక్షన్లు భారీగా పడిపోయాయి. నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.41 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం. దీంతో ఈ సినిమా నిర్మాతకు దాదాపు రూ.50-70కోట్ల మేర నష్టం వాటిలినట్లు ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ నెల 22వ తేదీన చిరంజీవి పుట్టిన 68వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. అదే రోజున చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సోగ్గాడే చిననాయన సినిమా దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ ఉంటుదని తెలుస్తోంది. ఈ సినిమాకు చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహరించనున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి