Nonstick Pans: నాన్ స్టిక్ పాన్స్ వాడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి

ఈ మధ్య కాలం నాన్ స్టిక్ పాన్స్ వాడకం పెరిగిపోయింది . అయితే వీటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే త్వరగా పాడవడం జరుగుతుంది. వీటిని సన్నని మంట పై మాత్రమే పెట్టాలి. కలపడానికి స్టీల్ స్పూన్స్, క్లీన్ చేయడానికి గట్టి పీచు వాడకూడదు.

New Update
Nonstick Pans: నాన్ స్టిక్ పాన్స్ వాడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి

Nonstick Pans: ప్రస్తుతం నాన్ స్టిక్ పాన్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఒకప్పుడు ఏదైనా ఫ్రై చేసినప్పుడు.. అంతా అడుగుపెట్టేసి క్లీన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ నాన్ పాన్స్ వచ్చాక వంట చాలా ఈజీగా అవ్వడమే కాకుండా శుభ్రం చేసే శ్రమ కూడా తగ్గింది. అయితే ఇవి ఎక్కువ కాలం పాటు ఉండాలంటే వీటిని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..

స్టీల్ స్పూన్స్ వాడకూడదు

నాన్ స్టిక్ పాన్స్ పై మెటల్ పాత్రలను అస్సలు పెట్టకూడదు. కొంత మంది పాన్ పైనే వెజిటేబుల్స్ లేదా ఏదైనా కట్ చేయడం, లేదా కలపడానికి స్టీల్, మెటల్ స్పూన్స్ వాడడం చేస్తుంటారు. దీని వల్ల వాటి గీతలు పడి.. నాణ్యతను కోల్పోతుంది. దీంతో త్వరగా పాడవుతుంది. చెక్క లేదా ప్లాస్టిక్ స్పూన్స్ వాడడం మంచిది.

తక్కువ మంట పై ఉంచాలి

నాన్ స్టిక్ పాన్స్ అధిక మంట పై ఉంచకూడదు. వేడి ఎక్కువైనప్పుడు పాన్ పై ఉన్న టెఫ్లాన్ లేయర్ దెబ్బతింటుంది. దీని వల్ల పాన్ పనికిరాకుండా పోతుంది. అలాగే నాన్ స్టిక్ పాన్స్ వేడిగా ఉన్నప్పుడు వాటి చల్లటి నీళ్లు పోస్తే పాడవుతాయి. కాస్త చల్లారిన తర్వాత క్లీన్ చేసుకోవాలి.

పదునైన స్క్రబ్బర్స్ తో రుద్దడం

ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. నాన్ స్టిక్ పాన్స్ శుభ్రం చేయడానికి పదునైన స్క్రబ్బర్స్, మెటల్ స్కౌరింగ్ ప్యాడ్స్, కఠినమైన డిటర్జెంట్స్ వాడకూడదు. ఇవి పాన్ పై ఉన్న సున్నితమైన నాన్ స్టిక్ కోటింగ్ ను తొలగిస్తాయి. దీంతో పాన్ ఫ్రై చేయడానికి పనికిరాదు. సున్నితంగా క్లీన్ చేయాలి.

యాసిడిక్ ఫుడ్స్ వండకూడదు

నాన్ స్టిక్ పాన్ పై కేవలం ఫ్రై చేసే ఐటమ్స్ మాత్రమే కుక్ చేయాలి. ముఖ్యంగా యాసిడిక్ ఫుడ్స్.. టమోటో, లెమన్ తో కూడిన ఆహారాలు అస్సలు వండకూడదు. వీటిలోని యాసిడిక్ గుణాలు పాన్ పై నాన్ స్టిక్ పూతను తొలగిస్తాయి. దీంతో ఒకసారి తర్వాత మళ్ళీ వాడడానికి పనికిరాదు.

ఇది కూడా చదవండి: కిచెన్‌లో ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు వాడుతున్నారా?..ఈ ముప్పు తప్పదు

Advertisment
Advertisment
తాజా కథనాలు