తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు..బండి ఔట్..కిషన్ రెడ్డి ఇన్..!!

అంతా ఊహించినట్లుగానే తెలంగాణ బీజేపీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం కేంద్రమంత్రిగా వ్యవహారిస్తున్న్ కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర చీఫ్ గా ఉన్న బండి సంజయ్ ను త్వరలోనే కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించనున్నట్లు సమాచారం.

New Update
తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు..బండి ఔట్..కిషన్ రెడ్డి ఇన్..!!

గత కొన్నాళ్లుగా తెలంగాణ బీజేపీలో ఏదో జరుగుతోందన్న ఊహాగానాలకు చెక్ పడినట్లే కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీ చీఫ్ గా బాధ్యతలను అప్పగించిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ఇప్పటివరకు స్టేట్ బీజేపీ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ ను త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అటు బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ కు కూడా పార్టీలో కీలక పదవి కట్టబెడతారన్న ప్రచారం  సాగుతోంది. వారంలోగా ఈ మార్పులు జరగనున్నట్లు బీజేపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

tbjp
కొంతకాలంగా తెలంగాణ బీజేపీ నేతల మధ్య సమన్వయలోపం తెరపైకి వచ్చింది. నేతల మధ్య సయోధ్య కుదుర్చేందుకు హైకమాండ్ గట్టి ప్రయత్నాలే చేసింది. ఈ నేపథ్యంలోనే వరుసగా రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిచింది. రెండు రోజుల క్రితం ఈటెల రాజేందర్, లగడపాటి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పిలిచిన అధిష్టానం వారితో చర్చలు జరిపింది. మరుసటి రోజు బండి సంజయ్ ఢిల్లీకి రావాల్సిందిగా కబురు పెట్టింది. హుటాహుటినా ఢిల్లీకి వెళ్లిన బండి సంజయ్ అధిష్టానం పెద్దలతో సమావేశమయ్యారు. అయితే ఎప్పటినుంచో బండి సంజయ్ ను స్టేట్ చీఫ్ గా తప్పిస్తారన్న ఊహాగానాలు వచ్చాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు