KVP: ఈ పోస్టాఫీస్‌ స్కీమ్‌తో మీ డబ్బు రెట్టింపు అవుతాయి..తక్కువ సమయంలో అదిరిపోయే రాబడి!

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కిసాన్ వికాస్ పత్ర(KVP) పథకం వడ్డీ రేటును పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత, ఈ పథకం డిపాజిట్లను రెట్టింపు చేసే కాల వ్యవధి తగ్గింది. దీంతో KVP పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సంవత్సరానికి రూ. 5 లక్షలు వేస్తే 115నెలల్లో అది రూ.10లక్షలు అవుతుంది. ఎందుకంటే వడ్డీ 7.5శాతంగా ఉంది. కాలవ్యవధి కూడా 115 నెలలే (9 సంవత్సరాల 7 నెలలు).

New Update
KVP: ఈ పోస్టాఫీస్‌ స్కీమ్‌తో మీ డబ్బు రెట్టింపు అవుతాయి..తక్కువ సమయంలో అదిరిపోయే రాబడి!

ఇండియా పోస్ట్ అందించే దీర్ఘకాలిక సేవింగ్స్ సర్టిఫికెట్లలో కిసాన్ వికాస్ పత్రం(KVP)కూడా ఒకటి. ముఖ్యంగా రైతుల్లో పొదుపును ప్రోత్సహించేందుకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఈ స్కీమ్‌ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఈ పత్రాలను భారత్ పౌరులు ఎవరైనా సరే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. దేశంలో ద్రవ్యోల్బణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అందుకే పెట్టుబడికి ప్రమాదం ఉండని మార్గాలే ఎప్పటికైనా బెస్ట్. అందుకే రిస్క్‌ ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌ను ఎంచుకోవాలి. దీనికోసం పోస్టాఫీస్‌ స్మాల్ సేవింగ్ స్కీమ్ ఒక మంచి ఆప్షన్. మీరు మీ డబ్బును రెట్టింపు చేయాలనుకుంటే, పోస్టాఫీస్‌ కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో మీ డబ్బు కేవలం 115 నెలల్లోనే రెట్టింపు అవుతుంది.

తక్కువ సమయంలో మీ డబ్బు రెట్టింపు:
2023-24 ఆర్థిక సంవత్సరంలో, ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ స్మాల్ స్కీమ్ వడ్డీ రేటును పెంచింది. దీని కింద కిసాన్ వికాస్ పత్రపై వడ్డీని ఏటా 7.2శాతం నుంచి 7.5శాతానికి పెంచారు. అంటే గతంలో కంటే తక్కువ సమయంలో రెట్టింపు రాబడులు లభిస్తాయి. అటు దేశంలోని అన్ని పోస్టాఫీసులు, పెద్ద బ్యాంకుల్లో పెట్టుబడి కోసం KVP పథకం అందుబాటులో ఉంది.

publive-image KVP పోస్టాఫీస్‌ స్కీమ్‌తో మీ డబ్బు రెట్టింపు

కేవలం రూ. 1,000తో ప్రారంభించవచ్చు:

పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర పథకం కింద, పెట్టుబడిదార్లు తమ పెట్టుబడిని కేవలం రూ.1,000 తో ప్రారంభించవచ్చు. ఈ పథకంలోని మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. మీరు ఎంత ఎక్కువ మొత్తాన్నయినా ఇందులో పెట్టుబడిగా పెట్టవచ్చు. ఈ ప్రయోజనం పొందడానికి సింగిల్‌, జాయింట్‌ ఖాతాలను తెరవవచ్చు. మీకు కావలసిన వారిని నామినీగా చేసుకోవచ్చు. స్కీమ్ మెచ్యూరిటీకి ముందే ఖాతాదారు మరణిస్తే, నామినీ డెత్ క్లెయిమ్ చేసి మొత్తం డబ్బును పొందవచ్చు. అప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా దక్కుతుంది. సంవత్సరానికి రూ. 5 లక్షలు వేస్తే 115నెలల్లో అది రూ.10లక్షలు అవుతుంది. ఎందుకంటే వడ్డీ 7.5శాతంగా ఉంది. కాలవ్యవధి కూడా 115 నెలలే (9 సంవత్సరాల 7 నెలలు). ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి కిసాన్ వికాస్ పత్ర పథకం వడ్డీ రేటును పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత, ఈ పథకం డిపాజిట్లను రెట్టింపు చేసే కాల వ్యవధి తగ్గింది. ఇంతకుముందు, డబ్బు డబుల్‌ కావడానికి 120 నెలలు పట్టేది, ఇప్పుడు 115 నెలల్లోనే రెట్టింపు అవుతుంది.

KVP ఖాతాను ఎలా తెరవాలి?

10 ఏళ్ల వయస్సు పైబడిన ఎవరైనా కిసాన్ వికాస్ పత్ర కింద ఖాతా తెరవవచ్చు. అయితే, ఆ ఖాతా లావాదేవీలను చూడడానికి మైనర్‌కు ఒక సంరక్షకుడు కూడా అవసరం. ఖాతా తెరిచే ప్రక్రియ చాలా సులభం. ముందుగా మీరు మీ దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లండి. కిసాన్ వికాస్ పత్ర పథకం ఖాతాను తెరవడానికి అక్కడికి వెళ్లి సంబంధింత ఫారాన్ని నింపండి. ఆ తర్వాత దరఖాస్తు డబ్బును పోస్టాఫీసులో కట్టండి. ఈ ఖాతా తెరిచిన వెంటనే, మీరు కిసాన్ వికాస్ పత్ర ధృవపత్రం పొందుతారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు