Kisan Credit Card: రైతుల పాలిటి వరం.. కిసాన్ క్రెడిట్ కార్డు.. అప్లై చేయండిలా

KCC.. కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు అవసరమైనప్పుడు రుణాలు పొందడానికి సులువైన మార్గం. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు సంబంధించిన ఆకస్మిక ఖర్చులు తీర్చడంతో పాటు వారి సాగు ఖర్చులు తీర్చడానికి సకాలంలో, తగినంత క్రెడిట్ అందించడం ఈ పథకం లక్ష్యం.

Kisan Credit Card: రైతుల పాలిటి వరం.. కిసాన్ క్రెడిట్ కార్డు.. అప్లై చేయండిలా
New Update

Kisan Credit Card: రైతులకు ఎప్పుడూ ఎదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. అతివృష్టి, అనావృష్టి.. పంటల సైకిల్ దెబ్బతీస్తాయి. ఒక్కోసారి వాతావరణం అనుకూలించినా పంటకు సరైన గిట్టుబాటు ధర రాదు. వ్యవసాయం మీద ఆధారపడి బతికేవారికి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వారికి పంటల కోసం అవసరానికి ఒక్కోసారి డబ్బు దొరకదు. అప్పు ఇచ్చేవారు కూడా దొరకకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో రైతులను ఆడుకుంటాయి కిసాన్ క్రెడిట్ కార్డులు. కిసాన్ క్రెడిట్  కార్డుల గురించి ఇంకా చాలామంది రైతులకు అవగాహన లేదు. ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా తీసుకోవాలి.. దాని వలన ప్రయోజనాలు ఏమిటి ఇలాంటి అంశాలను తెలుసుకుందాం. 

కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు సులువుగా రుణాలు ఇచ్చేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్(Kisan Credit Card) స్కీమ్‌ను ప్రారంభించింది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణం సులువుగా పొందడమే కాకుండా, తక్కువ వడ్డీ రేట్లకు లోన్స్ పొందవచ్చు. పైగా ఈ లోన్స్ సకాలంలో చెల్లిస్తే 3 శాతం మేర వడ్డీ రాయితీ కూడా దొరుకుతుంది. 

రైతులు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే లోన్ పొందవచ్చు. పదే పదే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది. లోన్ వస్తుందో రాదోనన్న ఆందోళన ఉండదు. కిసాన్ క్రెడిట్ కార్డు(Kisan Credit Card) ద్వారా గరిష్టంగా రూ. 3 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. సకాలంలో చెల్లిస్తే 3 శాతం మేర వడ్డీ రాయితీ వర్తిస్తుంది. 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు రుణగ్రహీతలు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం కింద కవర్ అవుతారు. అర్హత కలిగిన పంటలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పి.ఎమ్.ఎఫ్.బి.వై.) కింద కవర్ అవుతాయి. వడ్డీ రేటు రూ. 3 లక్షల వరకు 7% గా ఉంటుంది.

ఇప్పుడు ఈ కార్డు తీసుకోవడానికి ఎవరు అర్హులు అనే విషయం చూద్దాం.. 

పంటలు సాగు చేస్తున్న రైతులు, ఉమ్మడి రుణగ్రహీతలు, కౌలు రైతులు అందరూ కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక బ్యాంకు బ్రాంచికి వెళ్లి దీనికి సంబంధించిన అప్లికేషన్ నింపాల్సి ఉంటుంది. దానికి  అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జత పరచాలి. అంటే ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డు, వ్యవసాయ భూమికి సంబంధించిన పాస్ బుక్ ప్రతి, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు సమర్పించాల్సి ఉంటుంది. 

రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు(Kisan Credit Card)తో వ్యవసాయ రుణాలు (Agriculture Loans) తీసుకోవచ్చు. గడువులోగా రుణాలు చెల్లించేవారికి వడ్డీపై సబ్సిడీ కూడా ఉంటుంది. రైతులు గతంలో ఎక్కువగా రుణాల కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడేవారు. ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకొని అప్పులపాలయ్యేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు బ్యాంకుల నుంచి సులువుగా రుణాలు ఇప్పించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది. వడ్డీ రేటు కూడా తక్కువ కావడంతో రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

కిసాన్ క్రెడిట్ కార్డ్ (Kisan Credit Card)తీసుకోవడానికి రైతులు అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకొని బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసిన తర్వాత రెండు వారాల నుంచి నాలుగు వారాల్లో కార్డు మంజూరవుతుంది. వ్యక్తిగతంగా, ఉమ్మడిగా వ్యవసాయం చేసే రైతులు, కౌలు రైతులు, స్వయం సహాయక బృందాలు, జాయింట్ లయబిలిటీ గ్రూప్‌లు కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ రూ.3,00,000. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న రైతులకు ఎక్కువ లోన్ లభిస్తుంది. కనీస వడ్డీ రేటు 7 శాతం మాత్రమే ఉంటుంది. అయితే, బ్యాంకులను బట్టి వడ్డీ రేటు మారుతుంది. వడ్డీపై 3 శాతం వరకు రాయితీ లభిస్తుంది. ఐదేళ్ల లోపు లోన్ తిరిగి చెల్లించవచ్చు.

Also Read:  రూపాయి పెడితే రూపాయి పావలా లాభం.. బంగారం లాంటి పెట్టుబడి.. 

కిసాన్ క్రెడిట్ కార్డ్(Kisan Credit Card) స్కీమ్‌లో చేరినవారికి రూపే డెబిట్ కార్డ్ కూడా లభిస్తుంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లిస్తే పంటలకు బీమా లభిస్తుంది. పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ , హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా లభిస్తాయి. రూ.25,000 క్రెడిట్ లిమిట్‌తో చెక్ బుక్ లభిస్తుంది. రైతులు లోన్ డబ్బుతో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు కొనొచ్చు.

కిసాన్ క్రెడిట్ కార్డును ఆన్ లైన్ లో కూడా తీసుకోవచ్చు. దానికోసం.. 

Step 1- మీరు ఏ బ్యాంకులో కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారో..  ఆ బ్యాంక్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- కిసాన్ క్రెడిట్ కార్డ్ ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేయాలి.

Step 3- పేరు, ఫోన్ నెంబర్ లాంటి బేసిక్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 4- ఆ తర్వాత రైతులు మిగతా వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

Step 5- అప్పుడు రిఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది.

Step 6- ఆ తర్వాత బ్యాంకు సిబ్బంది నుంచి కాల్ వస్తుంది. వారడిగిన వివరాలు చెప్పాలి. .

Step 7- ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలి.

సందేహాలు ఉంటే..?

కేసీసీకి సంబంధించి ఏమైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉన్నట్లయితే, కిసాన్ క్రెడిట్ కార్డు కస్టమర్ కేర్‌ని సంప్రదించవచ్చు. మీరు 1800115526 లేదా 011-24300606 టోల్‌ ఫ్రీ నంబర్లకు కాల్‌ చేసి కిసాన్‌ క్రెడిట్‌ కార్డు స్కీమ్‌కు సంబంధించిన సందేహాలు, సమస్యలను తెలియజేయవచ్చు. సర్వీస్‌ ప్రొవైడైర్‌ను అనుసరించి కాల్‌ ఛార్జీలు వర్తిస్తాయి. pmkisan-ict@gov.in కు మెయిల్‌ కూడా చేయవచ్చు.

అదండీ విషయం. కిసాన్ క్రెడిట్ కార్డులు రైతులకు అవసరమైం సమయంలో పెట్టుబడి కోసం డబ్బును అందిస్తాయి. అన్ని బ్యాంకులు కిసాన్ క్రెడి కార్డులను ఇస్తాయి. దీనికోసం మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని బ్యాంక్ లో అధికారులను సంప్రదించవచ్చు. గుర్తుంచుకోండి. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న లోన్ సకాలంలో చెల్లిస్తే.. వడ్డీ రాయితీతో పాటు.. మళ్లీ ఎప్పుడైనా డబ్బు అవసరం అయినపుడు వెంటనే లోన్ పొందటానికి అవకాశం ఉంటుంది.

Watch this interesting Video:

#kisan-credit-card #farmers
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe