Tirupati: తిరుపతిలో రూ. 3 కోట్ల స్నాక్స్ స్కాం.. జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు..!

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో రూ. 3 కోట్ల స్నాక్స్ స్కాం జరిగిందన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే స్నాక్స్ స్కాం జరిగిందని ఫిర్యాదు చేశారన్నారు. స్నాక్స్ స్కాంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Tirupati: తిరుపతిలో రూ. 3 కోట్ల స్నాక్స్ స్కాం.. జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు..!
New Update

Tirupati: తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్నాక్స్ స్కాం జరిగిందన్నారు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ రాయల్. స్నాక్స్ కు రూ. 3కోట్లు ఖర్చవ్వడమేంటి అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అన్ని స్కాంలు చూసిన జనం కొత్తగా స్నాక్స్ స్కాంను చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు వైసీపీ కార్పొరేటర్లే స్నాక్స్ స్కాం జరిగిందని ఫిర్యాదు చేశారన్నారు.

Also Read: లిక్కర్‌లో లక్ష కోట్ల అవినీతి.. రౌడీ డాన్లకు సజ్జల సాయం.. మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు..!

నగరపాలక సంస్థలో 90మందిని నియమించి 25నెలల పాటు జీతాలు ఇచ్చినట్లు లెక్కలు చూపించారని కిరణ్ రాయల్ తెలిపారు. నిమాయకాలు జరిగింది కానీ..వ్యక్తులు మాత్రం నగరపాలకసంస్థలో పనిచేయలేదన్నారు.  ప్రజాధనాన్ని వైసీపీ నేతలు, అధికారులు దుర్వినియోగం చేశారన్నారు. స్నాక్స్ స్కాంపై, 90మంది నియామకాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

అలాగే, 2కోట్ల రూపాయల విలువ చేసే డబుల్ డెక్కర్ బస్సు ను చెత్త సామాన్ల మధ్య పెట్టారన్నారు. డబుల్ డెక్కర్ బస్సును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు.

#kiran-royal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe