AP: ఏపీలో కిడ్నీ రాకెట్ కలకలం.. 30 లక్షలు ఇస్తామని నమ్మించి...

ఆర్థిక ఇబ్బందులతో‌ కిడ్నీ అమ్ముకోవాలనుకున్నానన్నారు బాధితుడు మధుబాబు. బాషా అనే వ్యక్తి కిడ్నీ ఇస్తే రూ. 30 లక్షలు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేశాడని వాపోయాడు. విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో తన కిడ్నీ తీసుకుని డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాడు.

New Update
AP: ఏపీలో కిడ్నీ రాకెట్ కలకలం.. 30 లక్షలు ఇస్తామని నమ్మించి...

Guntur : గుంటూరులో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. ఆర్థిక ఇబ్బందులతో‌ మధుబాబు అనే వ్యక్తి కిడ్నీ అమ్ముకున్నాడు. అయితే, డాక్టర్లు, మధ్యవర్తి, కిడ్నీ గ్రహిత తనను దారుణంగా మోసం చేశారని కిడ్నీ బాధితుడు మధుబాబు వాపోతున్నాడు. రూ. 30 లక్షలు ఇస్తామని చెప్పి లక్ష కూడా ఇవ్వలేదని ఆరోపిస్తున్నాడు. ఎడమ వైపు కిడ్నీ తీసుకుంటామని చెప్పి కుడివైపు కిడ్నీ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం మధుబాబు ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మికి అధికారులు షాక్

30 లక్షలు ఇస్తామని..

కిడ్నీ బాధితుడు మధుబాబు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో‌ కిడ్నీ అమ్ముకోవాలనుకున్నానన్నారు. ఫేస్ బుక్ లో కిడ్నీ కావాల్సిన వారి గురించి తెలుసుకున్నానని..కిడ్నీ ఇస్తే 30 లక్షలు ఇస్తామని విజయవాడకు చెందిన బాషా అనే వ్యక్తి చెప్పారన్నారు. విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆపరేషన్ చేశారని.. ఎడమవైపు కిడ్నీ తీసుకుంటామని చెప్పి కుడివైపు యాక్టివ్ గా ఉన్న కిడ్నీ తీసుకున్నారని వాపోయాడు.


Also Read: తమిళనాడులో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

ఆపరేషన్ చేసి..

అయితే, ఆపరేషన్ చేసిన తరువాత డబ్బులు ఇవ్వకుండా డాక్టర్ శరత్ బాబు, మధ్య వర్తి భాషా, కిడ్నీగ్రహిత వెంకటస్వామి తనను మోసం చేశారని ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం తన పరిస్థితి దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తనను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తనకు న్యాయం కావాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు.

విచారణ చేయండి..

అయితే, మధుబాబు ఆరోపణలపై ఆస్పత్రి యాజమాన్యం పొంతనలేని సమాధానం చెబుతోంది. డాక్టర్ జి. శరత్ బాబు మాట్లాడుతూ.. తమ ఆసుపత్రిలో జరిగిన కిడ్నీ మార్పిడి చికిత్సకు సంబంధించి వచ్చిన ఆరోపణలు ఏ మాత్రం నిజం కాదన్నారు. కిడ్నీ తీసుకున్న వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలన్నారు. ఆర్గాన్ ట్రాన్స్పోర్ట్ కమిటీ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఆపరేషన్ చేశానని చెప్పి, పేషెంట్లు చెప్పేది నిజమో కాదో విచారణ చేయలేనని డాక్టర్ పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు