ఖమ్మంలో సాండ్ మాఫియా నడుస్తోంది.. పువ్వాడపై తుమ్మల విమర్శలు

పువ్వాడ అజయ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేశారు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావు. పువ్వాడ ఆధ్వర్యంలో ఖమ్మంలో అరాచక రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ఇసుక నుంచి మట్టి వరకు అన్నీ దోచేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో ప్రజా పాలన రావాలంటే తనకు ఓటు వేయాలని కోరారు.

New Update
ఖమ్మంలో సాండ్ మాఫియా నడుస్తోంది.. పువ్వాడపై తుమ్మల విమర్శలు

KHAMMAM POLITICS: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమ ప్రచారాల్లో స్పీడ్ పెంచారు అన్ని పార్టీల రాజకీయ నాయకలు. ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్, BRS పార్టీల మధ్య రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao).. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ (Puvvada Ajay Kumar)పై తీవ్ర విమర్శలు చేశారు.

Also Read:  భారీ భూకంపం.. 132కి చేరిన మృతుల సంఖ్య

శుక్రవారం ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు.. BRS అభ్యర్థిగా బరిలో దిగుతున్న పువ్వాడ అజయ్ కుమార్ టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పువ్వాడ ఆధ్వర్యంలో ఖమ్మంలో అరాచక రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. ఇసుక నుంచి మట్టి వరకు అన్నీ దోచేస్తున్నారని మండిపడ్డారు. నగరంలో ఇప్పుడు కొత్తగా ట్రాన్స్‌పోర్ట్ మాఫియా కూడా వచ్చిందని అన్నారు. సామాన్యుడు ఒక ప్లాట్ కొనుక్కుంటే ఎప్పుడు ఎవరు వచ్చి కబ్జా చేస్తారో తెలియక భయంతో బ్రతుకుతున్నారని పేర్కొన్నారు. మంత్రిగా ఉండి పువ్వాడ అజయ్ కుమార్ తన సొంత నియోజకవర్గమైన ఖమ్మంలో అభివృద్ధి చేయలేక పోయారని మండిపడ్డారు. ఈ దుర్మార్గపు పాలన పోయి ఖమ్మంలో ప్రజా పాలన రావాలంటే నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో తనకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

10 ఏండ్లు అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, అలాగే రైతుబంధును రూ.15వేలకు పెంచుతామని అన్నారు. ఏ ప్రభుత్వం చేయనట్టుగా మొట్టమొదటి సారిగా కౌలు రైతులకు ఏడాదికి రూ.12వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. మరి తుమ్మల చేసిన వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు