CMD Prabhakar Rao: జెన్కో(GENCO) సీఎండీ ప్రభాకర్ రావు సంతకాన్ని ఫోర్జరీ చేసిన ప్రవీణ్ గుట్టురట్టైంది. సీఎండీ ప్రభాకర్ రావు(CMD Prabhakar Rao) పేరిట కూడిన సంతకంతో విద్యుత్ సంస్థల్లో నియామక పత్రాల పేరిట లక్షల్లో వసూళ్లు చేశాడు ప్రవీణ్(Praveen). విద్యుత్ సంస్థలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మిస్తున్నాడు ప్రవీణ్. భద్రాచలం ఐటీసీ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రవీణ్.. ఇటీవల ఐటీసీలోనే క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తున్న మాడపాటి రాజశేఖర్‌కు విద్యుత్ సంస్థలో ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. పది లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అపాయింట్మెంట్ లెటర్‌ను వాట్సాప్‌లో రాజశేఖర్‌కు పంపాడు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న తన స్నేహితుడికి అపాయింట్మెంట్ లెటర్ పంపించాడు రాజశేఖర్(Rajasekhar). దీన్ని నకిలీ నియామకపత్రంగా విద్యుత్ సౌధ అధికారులు తేల్చారు. నకిలీ నియామకపత్రంపై పోలీసులను విద్యుత్ సౌధ అధికారులు ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా ప్రవీణ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
జెన్కో పేరిట జాబ్ మోసాలు:
ఇక ఇటివలి కాలంలో విద్యుత్ సంస్థ చుట్టూ ఫేక్‌గాళ్లు తయారయ్యారు. నకిలీ అపాయింట్మెంట్ లేటర్లతో పాటు ఫేక్ జాబ్స్‌ని క్రియేట్ చేస్తూ అభ్యర్థల దగ్గర నుంచి అందినకాడికి దోచేస్తున్నారు. విద్యుత్తు సంస్థల్లో ప్రస్తుతం నోటిఫికేషన్లు లేవని, ఉద్యోగాల పేరుతో అసత్య ప్రచారాలను నమ్మవద్దని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు రెండు రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టాలన్నారు. అలాంటి వారితో నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ ఉద్యోగమైనా పరీక్షలు, అర్హతలు, ఇంటర్వ్యూల ఆధారంగానే వస్తుందన్నారు. మణుగూరులో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ నియామకపత్రాలు వెలుగులోకి రావడంతో విజిలెన్స్ విచారణ కొనసాగుతోందన్నారు.
పెరుగుతున్న ఫొర్జరీ కేసులు:
ఇటివలి తెలంగాణలో ఫోర్జరీ కేసులు పెరిగిపోయాయి.. ఉన్నతధికారులు, మంత్రులను కూడా వదలడంలేదు కేటుగాళ్లు. మంత్రుల సంతకాలను కూడా మోసగాళ్లు ఫోర్జరీ చేస్తున్నారు. గత వారం తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకం ఫోర్జరీ అయింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం నర్రెగూడం గ్రామానికి చెందిన గౌసె పాషా, గుంటి శేఖర్‌లు ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చెందిన నకిలీ లెటర్‌హెడ్ తయారు చేసి డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని ఎర్రబెల్లి సంతకంతో జిల్లా కలెక్టర్‌కు లేఖ ఇచ్చారు. ఈ విషయం ఎర్రబెల్లి దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సంతకం ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి ఓఎస్డీ డాక్టర్ రాజేశ్వర్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గౌస్ పాషా, గుంటి శేఖర్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పీజీ మెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌ను రద్దు..!