Khammam Congress: ఖమ్మం కాంగ్రెస్‌లో మూడు స్తంభాలాట.. ఇలా అయితే ఎలా..?

ఖమ్మం కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ప్రస్తుతం అక్కడ నడుస్తున్న మూడు ముక్కలాట పార్టీలో టెన్షన్ పెట్టిస్తోంది. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గాలకు ఏమాత్రం పొసగడం లేదు. మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విజయభేరీ సభ సన్నాహక సమావేశంలో వీరి మధ్య వర్గ పోరు బయటపడింది.

New Update
Khammam Congress: ఖమ్మం కాంగ్రెస్‌లో మూడు స్తంభాలాట.. ఇలా అయితే ఎలా..?

Khammam Congress: ఖమ్మం కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ప్రస్తుతం అక్కడ నడుస్తున్న మూడు ముక్కలాట పార్టీలో టెన్షన్ పెట్టిస్తోంది. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గాలకు ఏమాత్రం పొసగడం లేదు. మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విజయభేరీ సభ సన్నాహక సమావేశంలో వీరి మధ్య వర్గ పోరు బయటపడింది. ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జ్, మహారాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నసీంఖాన్‌‌, భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీహెచ్‌‌, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు సన్నాహక సమావేశానికి హాజరయ్యారు.

మైక్ విసిరేసిన వీహెచ్.. మధ్యలోనే వెళ్లిపోయిన భట్టి..

ఈ క్రమంలో వీహెచ్ మాట్లాడుతుండగా రేణుకా చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఖమ్మంలో మీ అజమాయిషీ ఏంటి...? మిమ్మలను ఎవరు పిలిచారు అని ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. దీంతో వీహెచ్ ఆగ్రహంతో మైక్ విసిరేసి ప్రసంగం ఆపేశారు. ఈ వివాదం జరుగుతుండగానే సమావేశం మధ్యలో నుంచి ఎమ్మెల్యే భట్టి విక్రమార్క వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.

అభ్యర్థుల ప్రకటన నిర్ణయం అధిష్టానానిదే..

ఆ తర్వాత మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు అనుచరులు ఆందోళనకు దిగారు. టికెట్ విషయంలో అన్యాయం జరిగితే ఊరుకోమని నాయకులను హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని, జెండాను భుజంపై మోసిన వ్యక్తులను కాదని.. పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్లకే టిక్కెట్ కేటాయిస్తే ఊరుకోబోమని ఆందోళన చేపట్టారు. కార్యకర్తల రచ్చపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. అభ్యర్థుల ప్రకటన ఇక్కడ ఉన్న ఏ ఒక్కరి చేతుల్లో లేదన్నారు. తుది నిర్ణయం అధిష్టానందేనని తెలిపారు. అధికారం, పదవులు రాక ముందు కొట్లాట వద్దని సూచించారు.

పార్టీ శ్రేణులకు గుర్తింపు లేకుండా పోయింది..

మరోవైపు పార్టీని నమ్ముకుని, అన్ని విధాలుగా నష్టపోయినా .. పార్టీ శ్రేణులకు గుర్తింపు లేకుండా పోయిందంటూ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల్లో కడుపు మండే పరిస్థితులు ఉన్నాయన్నారు. నియోజకవర్గాల వారీగా సంప్రదింపులు జరిపి అభిప్రాయాలు తీసుకుంటానని ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జి నసీం ఖాన్ తెలపడంతో కార్యకర్తలు ఆందోళన విరమించారు. అభ్యర్థుల ప్రకటకు ముందే ఖమ్మం కాంగ్రెస్‌లో రచ్చ ఇలా ఉంటే.. ప్రకటించాక ఎంత రచ్చ జరుగుతుందోనన్న టెన్షన్‌ పార్టీ అధిష్టానంలో పట్టుకుంది.

Advertisment
తాజా కథనాలు