శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్‌కు నిప్పుపెట్టి ఖలిస్తానీ మద్దతుదారులు..!!

శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ కు నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు ఖలిస్తానీ మద్దతుదారు. ఈ ఘటనను అమెరికా తీవ్రంగా ఖండించింది. ఆదివారం తెల్లవారుజామున 1.30 నుంచి 2.30గంటల మధ్య ఖలిస్తానీ మద్దతుదారులు భారత కాన్సులేట్ కు నిప్పుపెట్టారని..వెంటనే శానిఫ్రాన్సిస్కో అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేసారి అమెరికా స్థానిక ఛానెల్ దియా టీవీ నివేదించింది.

New Update
శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్‌కు నిప్పుపెట్టి ఖలిస్తానీ మద్దతుదారులు..!!

ఖలిస్తానీ మద్దతుదారులు జూలై 2న శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌కు నిప్పు పెట్టారు. శాన్‌ఫ్రాన్సిస్కో అగ్నిమాపక శాఖ వెంటనే మంటలను అదుపులోకి తెచ్చింది. ఈ ఘటనలో పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఆదివారం తెల్లవారుజామున 1.30 నుంచి 2.30గంటల మధ్య ఖలిస్తానీ మద్దతుదారులు నిప్పు పెట్టారని ఆమెరికా స్థానిక ఛానెల్ దియాటీవీ నివేదించింది. ఈ ఘటన గురించి సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో ఈ ఘటనలో ఉద్యోగులు ఎవరూ కూడా గాయపడలేదని తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి ఖలిస్తాన్ మద్దతుదారులు వీడియోను కూడా విడుదల చేశారు.

indian consulate on fire in sanfrancisco

ఈ ఘటనను అమెరికా తీవ్రంగా ఖండించింది. అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఈ విషయంపై ట్వీట్ చేశారు. యూనైటెడ్ స్టేట్స్ లో దౌత్య సౌకర్యాలు లేదా విదేశీ దౌత్యవేత్తలపై విధ్వంసం లేదా హింస అనేది క్రిమినల్ నేరమంటూ ఆయన ట్వీట్ చేశారు. మార్చిలో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారతీయ కాన్సులేట్ పై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేసి ధ్వంసం చేసిన కొన్ని నెలల తర్వాత మళ్లీ ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిని భారత ప్రభుత్వం, భారతీయ అమెరిక్లను ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

మార్చినెలలో జరిగిన నిరసనల్లో ఖలిస్తాన్ మద్దతుదారులు నినాదాలు చేస్తూ..పోలీసులు ఏర్పాటు చేసిన తాత్కాలిక భద్రతా వలయాన్ని కూడా ఛేదించారు. అంతేకాదు కాన్సలేట్ ఆవరణలో రెండు ఖలిస్తానీ జెండాలను ఉంచడంతో వాటిని కాన్సలేట్ సిబ్బంది వెంటనే తొలగించేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు