హర్దీప్ సింగ్ నిజ్జర్‌ ఔట్

కెనడాకు చెందిన ఖలిస్థాన్ అనుకూల నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణించాడు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌ లోని సర్రే నగరంలో ఇతడ్ని కాల్చి చంపారు. ఉగ్ర కుట్రలకు సంబంధించి గతంలో ఇతనిపై ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

New Update
హర్దీప్ సింగ్ నిజ్జర్‌ ఔట్

Khalistan Hardeep Singh Nijjar shot dead in Canada

కెనడాలో ఉంటున్న హర్దీప్ సింగ్ నిజ్జర్ ఖలిస్థాన్ అనుకూల నాయకుడు. పంజాబీ ఆధిపత్యం గల సర్రే నగరంలో గురునానక్ సిక్కు గురుద్వారాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. అయితే.. అదే గురుద్వారా వద్ద ఇతడ్ని కాల్చి చంపారు. భారతదేశంలో నిషేధించబడిన వేర్పాటువాద సంస్థ సిక్కుల ఫర్ జస్టిస్(SFJ)తో నిజ్జర్ కు సంబంధాలు ఉన్నాయి.

బ్రాంప్టన్ సిటీలో ఖలిస్తాన్ ప్రజాభిప్రాయ సేకరణలో నిజ్జర్ కీలకపాత్ర పోషించాడు. అలాగే, హింసాత్మక చర్యలు, విధ్వంసక కార్యకలాపాల్లో ఇతను పాల్గొన్నందున భారత ప్రభుత్వం వాంటెడ్ టెర్రరిస్ట్ గా గతంలో ప్రకటించింది. భారత్ విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలో నిజ్జర్ పేరు కూడా ఉంది.

ఉగ్రదాడులకు కుట్ర పన్నాడనే ఆరోపణలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) గతంలో నిజ్జర్‌ పై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. పంజాబ్‌ లో ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతనిపై చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కూడా కోరింది.

2022లో పంజాబ్‌ లోని జలంధర్‌ లో హిందూ పూజారి హత్యకు కుట్ర పన్నాడని నిజ్జర్‌ పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎన్‌ఐఏ రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. పూజారి హత్యకు ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(KTF) కుట్ర పన్నింది. దీనికి నిజ్జర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు