Vivekam: 'వివేకం' చిత్రంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..! 'వివేకం' చిత్రం లైవ్ స్ట్రీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్టేట్ ఎలక్షన్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్రం హింసను ప్రేరేపించేల, ప్రజలను రెచ్చగొట్టేలా ఉందంటూ వైసీపీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. By Jyoshna Sappogula 27 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Vivekam: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి బయోపిక్ "వివేకం", చిత్రాన్ని లైవ్ స్ట్రీమింగ్ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం,స్టేట్ ఎలక్షన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల తరుణంలో "వివేకం" చిత్రం హింసను ప్రేరేపించేదిగాను, ప్రజలను రెచ్చగొట్టేదిగాను ఉందంటూ ఎన్నికల సంఘానికి మార్చి 20 వతేదీన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. Also Read: కవితకు ఖైదీ నంబర్ 666.. డల్‌గా మొదటిరోజు ఎన్నికల కమీషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో ఈ విధంగా పేర్కొన్నారు. ఎన్ ఎస్ ఎంటరటైన్ మెంట్ "వివేకం", చిత్రం మాజి ఎంపి వివేకానందరెడ్డి హత్యకేసు కధనం నేపధ్యంలో నిర్మించినట్లుగా ఉంది. అందులో పలు సన్నివేశాలను చూసినట్లయితే రాజకీయపార్టీకి సంబంధించి వైసీపీ జెండాలను పోలి ఉండేలా తీర్చిదిద్దారు. అందులో పలు పాత్రలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పేరు ఇతర పాత్రలను కూడా అదే పేర్లు ఉచ్చరించడం కూడా ఉంది. అటు వైసీపీని, జగన్ ని ఢీ ఫేమ్ చేసేలా ఉంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఇది యూట్యూబ్ లలో లైవ్ స్ర్టీమింగ్ కావడం, పలు సన్నివేశాలు సోషల్ మీడియాలో కూడా ప్రదర్శించడం జరుగుతోంది. నిజానికి వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సిబిఐ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దమైంది. కాబట్టి దీనిని బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. Also Read: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. సాయంత్రం 5 గంటల వరకే ఆ ఛాన్స్! 2019 ఎన్నికల సమయంలో ఇదే రీతిలో బయోపిక్ ఆఫ్ పిఎం మోది చిత్రం రూపొందిస్తే అప్పట్లో దానిని బ్యాన్ చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా "వివేకం" చిత్రాన్ని బ్యాన్ చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అడిషనల్ ఛీఫ్ ఎలక్ర్టోరల్ అధికారి హరేందిర ప్రసాద్ తగిన చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. #vivekam-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి