టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. By Karthik 07 Aug 2023 in తిరుపతి New Update షేర్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో అలిపిరి నడక మార్గంలో భక్తుల సౌకర్యార్దం నరసింహ స్వామి ఆలయం నుంచి మోకాలి మిట్ట వరకు షేడ్లు ఏర్పాటు చేస్తామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీంతో పాటు పీఏసీలో 2.5 కోట్ల రూపాయలతో మరమత్తులు చేపడుతున్నట్లు వెల్లడించారు. 24 కోట్ల రూపాయలతో సెకండ్ ఘాట్ రోడ్డులో బ్యారియర్లు ఏర్పాటు చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అంతే కాకుండా 4.5 కోట్ల వ్యయంతో నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఆధునికరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. 23.5 కోట్ల వ్యయంతో తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లేక్స్ నిర్మాణం జరుగుతోందని, ఈ క్యూలైన్లను మరింత పెంచాలని చూస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ అన్నారు. శ్రీనివాసం భవనం వద్ద సబ్ వే నిర్మాణానికి 4 కోట్లు కేటాయింపు చేస్తున్నట్లు ప్రకటించారు. గొండపై ఉన్న మంగాపురం ఆలయం వద్ద 3.1 కోట్ల వ్యయంతో అభివృద్ది పనులుకు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. మరోవైపు వకుళామాత ఆలయం వద్ద అభివృద్ది పనులకు 9.85 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.. తిరుమలలో అవుటర్ రింగ్ రోడ్డులో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు కోసం 2.6 కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. శ్రీనివాస సేతు ప్రాజేక్ట్ కి పనులు ప్రాతిపాదికన 118 కోట్లు కేటాయింపు చేసినట్లు వివరించారు. యస్వీ ఆయిర్వేద కళశాల అభివృద్ది పనులుకు టీటీడీ 11.5 కోట్లు కేటాయింపు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రుయా ఆస్పత్రిలో టీబీ వార్డు ఏర్పాటు చేసేందుకు 2.2 కోట్లు కేటాయించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీంతో పాటు యస్వీ సంగీత కళశాల అభివృద్ది పనులుకు 11 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. తిరుపతిలోని పెద్ద గంగమ్మ ఆలయం, వేశాలమ్మ ఆలయ అభివృద్ది పనులుకు 1.25 కోట్లు కేటాయించామన్నారు. మరోవైపు టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ పదవికాలం మరో మూడు సంవత్సరాలు పోడిగించినట్లు తెలిపారు. టీటీడీ ఆస్తుల పరిరక్షణలో భాగంగా 69 స్థలాలుకు కంచె ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన సుబ్బారెడ్డి అందుకోసం 1.25 కోట్లు మంజూరు చేశామని చెప్పారు ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు . 5 కోట్లను కేటాయించినట్లు టీటీడీ ఛైర్మన్ స్పష్టం చేశారు. #ttd #yv-subbareddy #key-decision #development-works మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి