AP: పెట్టుబడులు ఆపేందుకే జగన్ ఇలా చేశాడు: ఎంపీ కేశినేని చిన్ని

జగన్ ఇప్పటికైనా శవ రాజకీయాలు మానుకోవాలన్నారు ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని. వైసీపీ ఉనికి కోల్పోకుండా ఉండేందుకే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారన్నారు. ఆ ధర్నాకు అనేక మంది మద్దతు కోరినా ఎవరు ఇవ్వలేదని.. అఖిలేష్ యాదవ్ ఒక్కరే మద్దతు పలికారన్నారు.

New Update
AP: పెట్టుబడులు ఆపేందుకే జగన్ ఇలా చేశాడు: ఎంపీ కేశినేని చిన్ని

MP Kesineni Chinni: రాష్ట్రంకు కావల్సిన నిధులు కోసం రెండు నెలలుగా కృషి చేస్తున్నామన్నారు ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని. చంద్రబాబు కృషి వలన కేంద్ర బడ్జెట్ లో అత్యధిక నిధులు ఏపీకి రావడం శుభ పరిణామన్నారు. కరువు ప్రాంతాలుగా ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి రూ. 900 కోట్లు కేటాయించారని.. విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి అన్ని ప్రాంతాలకు సర్వీసులు ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ ధర్నాపై స్పందించారు. వైసీపీ ఉనికి కోల్పోకుండా ఉండేందుకే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారన్నారు. ఆ ధర్నాకు అనేక మంది మద్దతు కోరినా ఎవరు ఇవ్వలేదని.. అఖిలేష్ యాదవ్ ఒక్కరే మద్దతు పలికారని కామెంట్స్ చేశారు. ఢిల్లీ ధర్నా ద్వారా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు ఓడించారనే కసితో అభివృద్ధి జరగకుండా ధర్నాల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

విజయవాడ ట్రాఫిక్ సమస్య పరిష్కారంకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. తూర్పు బైపాస్ అవసరమని అనుమతులు నీతి అయోగ్ లో లభించనున్నాయన్నారు. జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా రాష్ట్రానికి రూపాయి తీసుకురాలేదని.. జగన్ ఇప్పటికైనా శవ రాజకీయాలు మనేయాలని అన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 36 మందు హత్య జరిగితే ఆ వివరాలు డీజీపీకి ఇవ్వాలని కోరారు. Acaల్లో అక్రమాలు చాలా జరిగాయని.. ఆగస్టు 4న aca జనరల్ బాడీ మీటింగ్ జరుగుతోందని.. ఆ మీటింగ్ లో పాత బాడీ రాజీనామాలు ఆమోదిస్తామన్నారు. 28 రోజుల్లో తరవాత కొత్త పాలకవర్గం ఎంపిక జరుగుతోందన్నారు.

Advertisment
తాజా కథనాలు