Keshava Rao: రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా

TG: బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ కు అందించారు. కేకే రాజీనామాతో కాంగ్రెస్ కు రాజ్యసభలో మరో సీటు దక్కనుంది. కాగా నిన్న కేశవరావు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

New Update
Keshava Rao: రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా

Keshava Rao: బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ కు అందించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినా ఆయన.. తన రాజ్యసభ సభ్యత్వానికి ఈరోజు రాజీనామా చేశారు. కేకే రాజీనామాతో కాంగ్రెస్ కు రాజ్యసభలో మరో సీటు దక్కనుంది. కాగా నిన్న కేశవరావు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా కేశవరావు రాజ్యసభకు వెళ్లనున్నట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనతంరం తన కూతురు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మితో కలిసి కేశవరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరగా.. కేశవరావు నిన్న తన సొంత గూటి పార్టీకి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు