/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/it-is-unlikely-that-we-will-attend-but-we-will-announce-our-decision-tomorrow-said-brs-mp-k-keshava-rao-on-new-parliament-building-opening-issue-.webp)
Keshava Rao: కె. కేశవరావు రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ ఆమోదించారు. ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. గురువారం ఆయన రాజ్యసభ చైర్మన్ ను కలిసి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో రాజ్యసభలో 16 సీట్లు ఖాళీ అయ్యాయి. కాగా శుక్రవారం జైలు నుంచి లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసి గెలుపొందిన అమృత్‌పాల్‌సింగ్, ఇంజనీర్ రషీద్ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. పెరోల్‌పై బయటకు వచ్చిన వారు లోక్‌సభలో భారీ భద్రత నడుమ ప్రమాణం స్వీకారం చేశారు. పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్ నుంచి అమృత్‌పాల్ సింగ్, బారాముల్లా నుంచి రషీద్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు.