ఓ వ్యక్తిని హనీ ట్రాప్ చేసిన సీరియల్ నటిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని ముగ్గులోకి దించి నగ్న చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేశారన్న కారణంగా ఆమెను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. అతని నుండి రూ. 11 లక్షలను వసూలు చేసినందుకు ఆమెతో పాటు ఆమె స్నేహితురాలిని పోలీసులు శ్రీ కృష్ణ జన్మస్థానానికి పంపించారు. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. పోలీసుల వివరాల ప్రకారం...
ప్రముఖ సీరియల్ నటి నిత్య శశి ఇటీవల అద్దె ఇంటి కోసం వెతికారు. ఓ ఇంట్లో ఖాళీ వుండటంతో ఆ ఇంటి యజమాని(75)ను ఆమె ఫోన్ లో సంప్రదించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వచ్చి ఆమె ఇళ్లు చూసి వెళ్లారు. త్వరలోనే వాళ్లిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఈ క్రమంలో ఆ వృద్దున్ని నిత్య తన ఇంటికి ఆహ్వానించింది. ఇంటికి వెళ్లిగానే అతన్ని మాటల్లోకి దించి అతని ఒంటిపై బట్టలను విప్పి నగ్నంగా మార్చింది.
వెంటనే అక్కడ వున్న ఆమె స్నేహితురాలు బిను అతన్ని న్యూడ్ గా ఫోటోలు తీసింది. రూ. 25 లక్షలు ఇవ్వాలని లేదంటే ఆ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించారు. దీంతో ఆ వృద్దుడు రూ. 11 లక్షలు చెల్లించాడు. కానీ అంతటితో ఆగని నిత్య, ఆమె స్నేహితురాలు ఆ వృద్దున్ని మరోసారి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో విసిగి పోయిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డిమాండ్ చేసినంత డబ్బు ఇస్తానంటూ వాళ్లిద్దరిని ఆ వృద్దుడు తన ఇంటికి పిలిపించాడు. దీంతో వాళ్లిద్దరు అక్కడకు వచ్చారు. కానీ అప్పటికే అక్కడ కాపు కాసిన పోలీసులు వాళ్లిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆమెపై ఇలాంటి కేసులేమైనా వున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరపుతున్నారు. ఆమె ప్రస్తుతం ఓ మళయాలం సిరియల్ లో నటిస్తున్నారు.