కేరళలో పేలుళ్లు..రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్.. లొంగిపోయిన నిందితుడు..!

కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పెట్టింది తానేనని త్రిసూర్ జిల్లాలోని కొడకరా పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి లొంగిపోయినట్లు సమాచారం. అధికారులు నిందితుడిని విచారిస్తున్నారు. అయితే, ఈ పేలుడుతో అతడికి సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. కేరళలోని కొచ్చిలో ఈ ఉదయం పేలుళ్లు జరగడం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు.

కేరళలో పేలుళ్లు..రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్.. లొంగిపోయిన నిందితుడు..!
New Update

Kerala Blasts updates: కేరళలోని ఓ కన్వెన్షన్ సెంటర్​లో భారీ పేలుడు సంభవించి ఒకరు మరణించారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 36 మంది గాయపడ్డారు. వీరిలో పది మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎర్నాకులంలోని కాళామస్సేరీలో ఉన్న జమ్రా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. 2000వేల మందికిపైగా పాల్గొన్న ఓ మతపరమైన కార్యక్రమం​ జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఇందుకు ఐఈడీ ఉపయోగించారని వెల్లడించారు.

Also Read: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కేరళ.. అసలేమైందంటే?

పేలుడుకు సంబంధించి ఆదివారం ఉదయం 9.40 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు వారు వెల్లడించారు. కన్వెన్షన్ సెంటర్ నుంచి హుటాహుటిన ప్రజలను బయటకు పంపించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనలో ఓ మహిళ చనిపోయిందని తెలిపారు. కన్వెన్షన్​ సెంటర్​లో భారీ పేలుడు కన్వెన్షన్​ హాల్​లో మూడు నుంచి నాలుగు చోట్ల పేలుళ్ల జరిగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చుట్టుపక్కల మండలాలైన వరపుజ, అంగమలి, ఎడపల్లి నుంచి భారీ సంఖ్యలో వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రార్థనా సమయంలో వీరంతా కళ్లు మూసుకొని ఉండగా.. హాలు మధ్యలో భారీ పేలుడు జరిగినట్లు చెప్పారు. అనంతరం మరో రెండు మూడు చిన్న పేలుళ్లు జరిగాయని వెల్లడించారు. ఈ కన్వెన్షన్‌ సెంటర్‌ లోపలి వైపు నుంచి తాళం వేసి ఉండటం వల్ల క్షతగాత్రులను తరలించడంలో కొంత జాప్యం జరిగిందని పోలీసులు తెలిపారు.

ఘటనలో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్ తెలిపారు. వారందరికి కాళామస్సేరీ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే వారిని వేరే ఆస్పత్రికి తరలిస్తామని వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులును ఆదేశించారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.

ఘటన చాలా దురదృష్టకరం : కేరళ ముఖ్యమంత్రి
ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​స్పందించారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. దీనికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరపాలని అధికారులు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. మరోవైపు, పేలుడు ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా ఆరా తీశారు. సీఎం​ విజయన్​కు ఫోన్​ చేసి మాట్లాడారు.

ఐఈడీ దాడి..
పేలుడు కోసం ఐఈడీ వాడినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చినట్లు కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అయితే పేలుడు వల్ల మహిళ మృతి చెందలేదని.. మంటలు అంటుకుని చనిపోయిందని కేరళ మంత్రి వీఎన్​ వాసవన్ తెలిపారు.

ఇదిలా ఉండగా..కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పెట్టింది తానేనని త్రిసూర్ జిల్లాలోని కొడకరా పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి లొంగిపోయినట్లు సమాచారం. అధికారులు నిందితుడిని విచారిస్తున్నారు. అయితే, ఈ పేలుడుతో అతడికి సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, మతతత్వ, సున్నితమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

#kerala-blasts
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe