Kejriwal: ఈడీ కస్టడి నుంచే తొలి ఆదేశాలు.. ప్రభుత్వ అధికారులకు కేజ్రీవాల్‌ నోట్‌!

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఈడీ కస్టడీనుంచి తొలి ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి సరఫరాకు సంబంధించి జలమంత్రిత్వశాఖను నిర్వహిస్తున్న ఆతిశీ మార్లీనాకు నోట్‌ పంపించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జైలు నుంచి పాలించకుండా ఏ చట్టమూ అడ్డుకోలేదన్నారు.

New Update
Kejriwal: ఈడీ కస్టడి నుంచే తొలి ఆదేశాలు.. ప్రభుత్వ అధికారులకు కేజ్రీవాల్‌ నోట్‌!

liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) జైలు నుంచి తొలి ఆదేశాలు జారీ చేశారు. ఈడీ కస్టడినుంచే ఢిల్లీకి సంబంధించి మంచినీటి సరఫరా విషయంలో అధికారులకు కీలక సూచనలు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే జైలు నుంచి పరిపాలన కొనసాగించడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి కావడం విశేషం.

నోట్‌ రూపంలో..
ఈ మేరకు జైలు నుంచి కేజ్రీవాల్‌ పరిపాలన కొసాగిస్తారా? లేదా? అనే అంశంలో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఆదివారం జైలు నుంచే ఆయన పాలన మొదలుపెట్టినట్లు ఆప్‌ నాయకులు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీ నుంచే కేజ్రివాల్ ఢిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఓ నోట్‌ రూపంలో జలమంత్రిత్వశాఖను నిర్వహిస్తున్న ఆతిశీ మార్లీనాకు ఆయన సమాచారం పంపించారని, దీనిపై ఆమె సమాచారం ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి: SOWMYA SHETTY : నటి సౌమ్య శెట్టిపై మరో కేసు.. తండ్రి ఫిర్యాదుతో!

ఏ చట్టమూ అడ్డుకోలేదు..
ఇక మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయగా.. మార్చి 28 వరకు కోర్టు ఈడీ కస్టడీకి ఇచ్చింది. కేజ్రీవాల్ ఇంకా సీఎం పదవికి రాజీనామా చేయలేదు. లాకప్‌ నుంచే పాలన కొనసాగిస్తారని ఆప్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘మేము అంతకు ముందు చెప్పినట్లుగా ఆయనే పాలన కొనసాగిస్తారు. జైలు నుంచి పాలించకుండా ఏ చట్టమూ అడ్డుకోలేదు. ఆయన పై ఆరోపణలు రుజువుకాలేదు. అందుకే ఆయనే సీఎం పదవిలోనే కొనసాగుతారు’ అని మంత్రి ఆతిశీ మార్లీనా మీడియాకు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు