Tour Plan: టూర్‌కి వెళ్లేప్పుడు ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి

దూర ప్రయాణాలకు వెళ్లేప్పుడు కచ్చితంగా ప్లాన్‌ చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. ప్రణాళిక లేకుండా విహారయాత్రకు వెళ్లేవారు సమస్యలను ఎదుర్కోవాల్సి రావడం తరచుగా చూసి ఉంటారు. అందుకే ముందుగా మీరు వెళ్లే ప్రదేశం గురించి అధ్యయనం ఎలా చేయాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Tour Plan: టూర్‌కి వెళ్లేప్పుడు ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి

Tour Plan: ప్రయాణాలు, టూర్లు వేసేముందు ముందుగానే ప్లాన్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ప్లాన్ సరిగ్గా ఉంటే బడ్జెట్‌లోనే అంతా చుట్టిరావొచ్చు. అంతేకాకుండా ప్రయాణాన్ని కూడా ఆస్వాదించవచ్చు. దూర ప్రయాణాలకు వెళ్లేప్పుడు కచ్చితంగా ప్లాన్‌ చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. ప్రణాళిక బాగుంటే ప్రయాణంలో డబ్బు ఆదా చేసుకోవచ్చు. ప్రణాళిక లేకుండా విహారయాత్రకు వెళ్లేవారు సమస్యలను ఎదుర్కోవాల్సి రావడం తరచుగా చూసి ఉంటారు.

publive-image

కాబట్టి ముందుగా మీరు వెళ్లే ప్రదేశం గురించి అధ్యయనం చేయండి. అక్కడికి వెళ్లాల్సిన ప్రదేశాల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. మీరు వెళ్లే ప్లేస్‌లో మంచి హోటల్స్ గురించి కూడా సమాచారాన్ని పొందాలి. అప్పుడు బడ్జెట్ ప్రకారం మీ ప్యాకింగ్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ట్రిప్‌లో తీసుకెళ్లాల్సిన వస్తువుల జాబితాను రెడీ చేయాలి. దాని ప్రకారం ప్యాక్ చేసుకోవాలి. ప్యాకింగ్ చేసేటప్పుడు దుస్తులను బ్యాగ్‌లో ఖాళీ ఉండేలా సర్దుకోవాలి. సీజన్‌కు తగిన బట్టలను తీసుకెళ్లాలి. ప్రయాణానికి బయలుదేరే అవసరమైన పేపర్స్‌ను సిద్ధం చేసుకోవాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, గుర్తింపు కార్డు, ఆధార్ కార్డ్ మొదలైనవాటిని దగ్గర ఉంచుకోవాలి. ఎక్కువ లగేజీ తీసుకెళ్తే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

publive-image

విమానం లేదా రైలులో వెళ్తుంటే ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకోవాలి. అలా చేయడం వల్ల డబ్బులు కూడా ఆదా అవుతాయి. ప్రయాణానికి ముందే హోటల్‌ను బుక్‌ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అక్కడికి ఎలా చేరుకోవాలో రూట్‌మ్యాప్‌ కూడా చూడాలి. సందర్శించడానికి మంచి ప్రదేశాల గురించి పూర్తి సమాచారాన్ని ముందే తెలుసుకోవాలి. అక్కడ చౌకగా ఆహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలి. అకస్మాత్తుగా ఏ ప్రయాణాన్ని చేపట్టవద్దని నిపుణులు అంటున్నారు. ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో వారం ముందుగానే నిర్ణయించుకోవాలని చెబుతున్నారు. ముందే అవసరమైన మందులు, డబ్బులు తీసుకుని రెడీగా పెట్టుకోవడం మర్చిపోవద్దని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో మళ్లీ గ్రహాంతరవాసుల కలకలం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు